న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఒకవైపు సంతోషమే... మరోవైపు విషాదం: నితీష్ కుమార్

బీహార్: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన నలుగురు పోలీసులలో ముగ్గురిని క్షేమంగా విడుదల చేయడం సంతోషకరమైన అంశమే అయినప్పటికీ.. ఒకరిని హతమార్చడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమర్ అన్నారు. తమ వద్ద బందీలుగా ఉన్న ముగ్గురు పోలీసులను మావోయిస్టులు సోమవారం ఉదయం సురక్షితంగా విడుదల చేసిన విషయం తెల్సిందే. దీనిపై నితీష్ కుమార్ స్పందిస్తూ.. ముగ్గురు పోలీసులకు ఎలాంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా విడుదలల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేసమయంలో లూకాస్ టెటేను హత్య చేయడం విచారకరంగా ఉందన్నారు. అలాగే, చర్చలకు ఆహ్వానిస్తూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని వారి తోసిపుచ్చడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. కాగా, ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పోలీసులను వారివారి ఊర్లకు వెళ్లారని ఆయన తెలిపారు.