న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఎన్నారైల డిమాండ్‌కు పటేల్ మద్దతు!

న్యూఢిల్లీ: ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని ప్రవాస భారతీయులు చేస్తున్న డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఎన్నారైల డిమాండ్ పట్ల సానూకూలంగా స్పందిస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ కూడా ఎన్నారైలకు బాసటగా నిలిచారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్ టౌన్‌హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తనతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ కూడా ఎన్నారైల డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని భారతీయ - అమెరికన్లకు హామీ ఇచ్చారు. ద్వంద్వ పౌరసత్వమనేది కొత్త పరిణామం కాదని, ఇలాంటి పౌరసత్వమున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా త్వరలోనే చేరుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారతీయ-అమెరికన్లకు ప్రధానంగా ఆందోళనకరంగా ఉన్న ద్వంద్వ పౌరసత్వం, వీసా సమస్యలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.