న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
జైషే మొహమ్మద్ అధినేత కాల్చివేత

కాశ్మీర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ సెక్టార్‌లో జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ అధినేత ఉమర్ ఖతాబ్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు హోరాహోరీగా సాగిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఉమర్ ఖతాబ్ మరణించాడు. పూంఛ్ సెక్టార్‌లోని భట్టి-దార్ ప్రాంతంలోని మెంధర్ వద్ద తీవ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బ్రిగేడియర్ జనరల్ ఎస్.దువా వెల్లడించారు. తీవ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు కలిసి భట్టిదార్ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. భద్రతా బలగాల రాకను పసిగట్టిన జైషే అధినేత ఉమర్ ఖతాబ్, అతని అనుచరులు కాల్పులు జరుపగా, వీటిని తిప్పికొట్టే రీతిలో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఖతాబ్ మృతి చెందగా, అనుచరులు పారిపోయినట్టు దువా తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు ఎకే రైఫిల్స్, ఒక చైనా పిస్తోలు, గ్రెనైడ్, రూ.62 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.