న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
కేసీఆర్ నోట..సెటిలర్స్ మాట

హైదరాబాద్: ఏపీపిఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగలేదని ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్న 42%కన్నా ఎక్కువగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన అభ్యర్ధులతో పోస్టులు భర్తీ చేసామని ఓ వైపు ఏపీపిఎస్సీ నివేదికలివ్వగా, ఇన్నాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కొన్నేళ్లుగా నివాసముంటున్న వారు ఇక్కడి ప్రజలేనని వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయబోమని చెప్తూ వస్తున్న తెరాస అధినేత కేసీఆర్ హటాత్తుగా తన పల్లవి మార్చేసి, ఏపీపిఎస్సీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న పోస్టుల భర్తీ అంతా తప్పుల తడకేనని తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో తెలంగాణ వాసులకన్నా సేటిలర్లే ఎక్కువగా ఉన్నారని అందుకే తమ ఆందోళన అని ప్రకటించడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో తెరాస తమ పంధాని మార్చుకోబోతోందనటానికి కేసీఆర్ తాజా ప్రకటనలే ఓ ఉదాహరణ అన్న ఆరోపణ వినిపిస్తున్నాయి.