న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
వేరుశనగ పంటకు బీమా రూ.115 కోట్లు

కడప: జిల్లాకు 2009 సంవత్సరానికి సంబంధించి వేరుశనగ పంటకు బీమా కింద రూ. 115 కోట్లు మంజూరైందని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. ఆయన కడప స్టేట్‌గెస్ట్ హౌస్‌లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్, రాష్ట్ర మైనార్టీసంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లాతో కలసి వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ పంటకు సంబంధించి రూ. 701 కోట్లు మంజూరు కాగా అందులో వైఎస్ఆర్ జిల్లాకు రూ. 115 కోట్లు మంజూరైందన్నారు. రైతాంగానికి శుభపరిణామమని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతుందనడానికి ఈ మంజూరు ఓ ఉదాహరణ అన్నారు. బిందు సేద్యం కింద జిల్లాలో 13వేల హెక్టార్లు లక్ష్యంకాగా 4500 హెక్టార్లకు డ్రిప్ మంజూరైందన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు పరికరాలను త్వరలో పంపిణీ చేస్తామన్నారు.

ఇక తుంపర సేద్యం విషయానికొస్తే 3300 హెక్టార్లు లక్ష్యం కాగా ఆ లక్ష్యాన్ని అధికమించామని ఇందుకు సంబంధించి రైతులకు పరికరాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాయచోటి శాసన సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి, కోడూరు శాసన సభ్యుడు శ్రీనివాసులు, ఏపీఎంఐ ప్రాజెక్టు డైరెక్టర్ జొనాధన్, వ్యవసాయశాఖ జేడీ చిన్ననారాయణ, హార్టికల్చర్ ఏడీలు ధర్మజ, శ్రీనివాసులు పాల్గొన్నారు.సాయిప్రతాప్, రాష్ట్ర మైనార్టీసంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లాతో కలసి వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ పంటకు సంబంధించి రూ. 701 కోట్లు మంజూరు కాగా అందులో వైఎస్ఆర్ జిల్లాకు రూ. 115 కోట్లు మంజూరైందన్నారు. రైతాంగానికి శుభపరిణామమని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతుందనడానికి ఈ మంజూరు ఓ ఉదాహరణ అన్నారు. బిందు సేద్యం కింద జిల్లాలో 13వేల హెక్టార్లు లక్ష్యంకాగా 4500 హెక్టార్లకు డ్రిప్ మంజూరైందన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు పరికరాలను త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఇక తుంపర సేద్యం విషయానికొస్తే 3300 హెక్టార్లు లక్ష్యం కాగా ఆ లక్ష్యాన్ని అధికమించామని ఇందుకు సంబంధించి రైతులకు పరికరాలను పంపిణీ చేస్తామన్నారు.