న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
విశ్వ సృష్టికి భగవంతునికి సంబంధం లేదు

వాషింగ్టన్: ఈ విశ్వాన్ని భగవంతుడు సృష్టించలేదు. భౌతిక శాస్త్రం ప్రకారం గురుత్వాకర్షక శక్తి అన్నది సమస్త సృష్టికి మూలం, ఈ విశ్వం దాని మీదే ఆధారపడి ఉంది అని ప్రఖ్యాత బ్రిటిష్‌ భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్‌ హాకింగ్ అన్నారు. ఈ విషయాన్ని ఇటీవల తాను రాసిన ది గ్రాండ్‌ డిజైన్‌ అనే పుస్తకంలో వెల్లడించారు. విశ్వ ఆవిర్భావానికి మూలంగా భావిస్తున్న బిగ్‌బ్యాంగ్ వెనుక భౌతికశాస్త్ర మూలాలే ఉన్నాయని ఆయన తన తాజా పుస్తకంలో స్పష్టం చేశారు. గురుత్వాకర్షణలాంటి భౌతిక సూత్రాలవల్ల విశ్వం శూన్యం నుంచి తనను తాను సృజించుకుని, విస్తరించుకుంటుందని, ఇందులో భగవంతుడి ప్రమేయం ఉందని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. శాస్త్రానికి భగవంతునితో పని లేకుండా సృష్టికి సంబంధించిన అన్నిరకాల సందేహాలను నివృత్తి చేయగల సత్తా ఉందని హాకింగ్‌ తన పుస్తకంలో వ్యాఖ్యానించారు.

ఈ పుస్తక రచనకు అమెరికా భౌతిక శాస్తవ్రేత్త లియోనార్డ్ మెడినోవ్ కూడా హాకింగ్‌కు సహాయం అందిచారు. సెప్టెంబర్ తొమ్మిదిన ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలను ఓ ప్రముఖ దిన పత్రిక ది టైమ్స్ ప్రచురించింది. అంతేకాకుండా.. ఈ విశ్వాన్ని ఆ భగవంతుడే సృష్టించాడని, ఓ అరాచకం నుంచో లేదా మరో విస్ఫోటనం నుంచో అది ఏర్పడలేదని ఇసాక్ న్యూటన్ చెప్పిన సిద్ధాంతాన్ని కూడా హాకింగ్‌ తోసిపుచ్చారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే అసలు భగవంతుడే లేడని చెప్పిన హాకింగ్ తాను గతంలో రచించిన పుస్తకం ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌లో దేవుడి గురించి ప్రస్థావించడం గమనార్హం.