|
|
తాలిబన్‌పై అమెరికా నిషేధం!
వాషింగ్టన్: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ తాలిబన్‌పై అమెరికా నిషేధం విధించింది. ఇంకా పాక్ తాలిబన్‌ను అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ తరపున పోరాడే సంస్థగా ముద్రవేసిన అమెరికా, ఆప్ఘనిస్థాన్‌లోని సీఐఏ స్థావరాన్ని పేల్చివేయడానికి కుట్రపన్నాడని ఆ ముఠా నాయకుడు హకీముల్లా మసూద్‌పై కేసు పెట్టింది. అలాగే ఆ తీవ్రవాద సంస్థను సైతం అమెరికా తన అంతర్జాతీయ టెర్రరిజం బ్లాస్‌లిస్టులో ఉంచింది. గత ఏడాది డిసెంబరులో ఆప్ఘన్‌లోని సీఐఏ స్థావరంపై జరిగిన దాడిలో ఏడుగురు అమెరికన్లు మరణించారు. ఈ దాడికి మసూద్ కుట్ర పన్నాడని అమెరికా కేసు నమోదు చేసింది. అంతేగాకుండా మసూద్‌తో పాటు ఒకప్పుడు అతని శత్రువు, ఇప్పుడు అతని కుడి భుజం వంటి వాడైన వలీవుర్, రెహ్మాన్ జాడ తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం అందించిన వారికి రూ.50లక్షల డాలర్ల రివార్డును కూడా అందజేస్తామని అమెరికా ప్రకటించింది. మొత్తానికి మసూద్ నాయకత్వం వహిస్తున్న గ్రూపును అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా విదేశీ టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది.
|
|
|