|
|
శ్రీవారిని దర్శించుకున్న మన్మోహన్ సింగ్
చిత్తూరు: భారత ప్రధానమంత్రి డా, మన్మోహన్‌సింగ్ బుధవారం మద్యాహ్నం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయమహద్వారం వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి, టి.టి.డి స్పెసిఫైడ్ అధారిటి ఛైర్మన్ జె.సత్యనారాయణ, కార్యర్వాహణాధికారి ఐ.వై.ఆర్.క్రష్ణారావు సంయుక్త కార్యర్వాహణాధికారి యువరాజ్ తదితరులు ఆలయ మర్యాదలతో ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు. రంగనాయకుల మండపం నందు ప్రధానమంత్రికి వేదపండితులు ఆశీర్వచనం పలుకగ,దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి,కార్యర్వాహణాధికారి ఐ.వై.ఆర్.క్రష్ణారావు, ప్రధానమంత్రికి తీర్ధప్రసాదాలను అందజేసారు. స్వెసిఫైడ్ అధారిటి ఛైర్మన్ జె.సత్యనారాయణ, స్వామి వారి చిత్రపట్నా ప్రధానమంత్రికి అందించారు. రాష్ట్ర గవర్నరు ఇ.ఎస్.ఎల్. నరసింహన్, కేంద్ర మంత్రులు విలాస్ రావ్ దేశ్ ముఖ్, ప్రఫుల్ల కుమార్ పటేల్, పనబాక లక్ష్మీ, సుషీల్ కుమార్ షీండే, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డి.కె. అరుణ, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, కె.కేశవరావు, తిరుపతిలోక్ సభ సభ్యులు, తిరుపతి శాసన సభ్యులు కె. చిరంజీవి, టి.టి.డి. ట్రస్టు బోడు మాజీ ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు ప్రధాన మంత్రితోబాటు స్వామివారిదర్శించు కున్నారు.
|
|
|