న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
అభయహస్తంలో అవినీతి

కందుకూరు: మహిళల అభ్యున్నతికి అమలైన అభయహస్తం నిధులను ఎపిఎంతోపాటు మహిళా సమాఖ్య సిబ్బంది దుర్వినియోగపరుస్తున్నారని పరిగి మండల మహిళా సమాఖ్య మాజీ కోశాధికారి ఎస్‌ రజిని,ఎస్‌ స్వరూపలు ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. అభయహస్తం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.వెయ్యి మంజూరైతే, ఎపిఎం జయ,మహిళాసిబ్బంది కుమ్మకై ఒక్కొక్కరికి రూ.800 మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.ఎనిమిది వేలు ఏం చేశారని ప్రశ్నించారు. అభయహస్తంపై అవగా హనకు మండలపరిధిలో ఏఒక్క మహిళకు శిక్షణ ఇవ్వకుండా ఎపిఎం నిధులు డ్రా చేసిందని ఆరోపిం చారు. దీనికిగాను మీర్కాన్‌పేట బుక్‌కీపర్‌ పేరు రూ.20వేలు డ్రా చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. తిమ్మాపుర్‌లో నిర్వహించిన బుక్‌కీఫర్‌ శిక్షణకు రూ.2వేలు ఖర్చు అయితే ఎపిఎం జయ తమతో రూ.8వేల2వందలు ఖర్చు అయినవని చెక్కులు రా యించారని వివరించారు. అంతేగాక మండల పరిధిలో జాతీయ ఉపాధి హమీ పథకం కింద నిధులు కూలీలకు గడ్డపారల పంపిణీలో అవకతవకలు జరిగా యని ఆరోపించారు. అలాగే డ్వాక్రా మహిళల పిల్లల (9 నుండి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్ధినీ విద్యార్ధుల)కు ఈ ఏడాది రూ.2లక్షలు నిధులు విడుదలైన, సక్రమంగా అందడం లేదన్నారు. ఇకను ండి మహి ళలకు వచ్చే నిధుల చెక్కుల మీద ఎండిఒ సుజాత సంతకం పెడితే ఇలాంటి అవినీతి పనులు జరగవని వారు తెలిపారు.అలాగే నిధుల అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.