న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
బీహెచ్‌ఈఎల్‌కు మరో భారీ కాంట్రాక్టు

న్యూఢిల్లీ, జులై 21 (ఫీచర్స్ ఇండియా): చత్తీస్‌గఢ్‌లో 1,200 మెగావాట్ల బొగ్గు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కావాల్సిన యంత్రాలను తయారు చేసే కాంట్రాక్టును బీహెచ్‌ఈఎల్‌ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.2,225 కోట్లని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దైనిక్‌ భాస్కర్‌ పవర్‌ లిమిటెడ్‌ (డీబీపీఎల్‌) తరఫున బీహెచ్‌ఈఎల్‌ ఈ విద్యుత్‌ ప్లాంట్‌కు కావాల్సిన బాయిలర్లు, టరె్బైన్లు, జనరేటర్లను సరఫరా చేస్తుంది. చత్తీస్‌గఢ్‌లోని బరాదరా ప్రాంతంతో బొగ్గు ఆధారిత పవర్‌ప్లాంట్‌ నిర్మి స్తున్నారు. పవర్‌ప్లాంట్‌కు డీజైన్‌, ఇంజనీరింగ్‌, ఉత్పత్తి, సరఫరా, యంత్రాలను నెలకొల్పి, వాటిని టెస్ట్‌ రన్‌ చేయడం. బీహెచ్‌ఈఎల్‌ ప్రస్తుతం 15వేల మెగావాట్ల విద్యుత ఉత్పత్తి కావాల్సిన యంత్రాలను తయారు చేస్తోంది. భవిష్యత్తులో 20 వేల మెగావాట్ల సామర్థ్యానికి పెంచే యోచనలో ఉంది.