న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఆర్ధిక క్రమశిక్షణపై కేంద్రం ప్రధాన దృష్టి

హైదరాబాద్, జులై 21 (ఫీచర్స్ ఇండియా): సూక్ష్మరుణ సంస్థల (మైక్రో ఫైనాన్స్‌) అగడాలకు త్వరలో కళ్ళెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయనున్నదని, దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు నగదును సర్థుబాటు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రాంతీయ సమావేశానికి ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్‌ మీనా, రాష్ట్ర ముఖ్యమంత్రి కె రోశయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోనల్‌ సమావేశానికి కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరైనారు. ఈ రాష్ట్రా లు తమ ప్రతినిధులతో ఆర్థికపరమైన అంశాలతో కూడిన నివేదికను సమావేశానికి అందచేసినట్లు ప్రణబ్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా ముఖ్యమంత్రులు, బ్యాంకర్లతో కూడిన జోనల్‌ సమావేశాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోనల్‌ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 25 సంవత్సరాల క్రితం తాను ఆర్థిక శాఖ కేంద్ర మంత్రిగా వ్యవహరించినప్పుడు ముఖ్యమంత్రుల జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించానని, ప్రస్తుతం కూడా అదే సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తున్నాని ప్రణబ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా మిగతా జోన్లతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు అన్ని స్థాయిల్లోనూ మెరుగైన పనితీరును కనబరిచినట్లు ప్రణబ్‌ ముఖర్జీ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సందర్భంగా సమ్మిళత ఆర్థిక వృద్ధి సాధించే దిశగా దక్షిణాది రాష్ట్రాలు మరింత ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉందని, బ్యాంకింగ్‌ రంగాన్ని పటిష్టం చేయాలని ఆయన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఐఆర్‌డిఏ, సెబీ, ఆర్‌బిఐ, పిఎఫ్‌ వంటి సంస్థల అంతర్గత అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని, ఏదైన రెండు సంస్థల మధ్య తలెత్తిన సమస్యలను సంయుక్త సంస్థలతో పరిమితుల మేరకు పరిష్కరిస్తామని, ఇటీవల ఐఆర్‌డిఏ, సెబీల మధ్య యూలిప్స్‌ పాలసీలపై చోటుచేసుకున్న వివాదాన్ని కేంద్రం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నదని ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంద ర్భంగా ప్రకటించిన ఆహార భద్రత పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకున్నదని, దీనిలో భాగంగా బిపిఎల్‌ కుటుంబాలకు కిలో రూ. 3లే 25 కేజీల బియ్యం, గోధు మలు అందిస్తామని అన్నారు. ఈ పథకం అమలుకు 20 10-11 బడ్జెట్‌లో రూ. 50 వేల కోట్లను కేటాయించిన ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వెల్లడిం చారు. దేశంలో ఆహార పంటల దిగుబడి పెరిగిందని, వచ్చే సీజన్‌ కూడా అందుబాటులోకి వస్తే ఆహార ద్రవ్యోల్బణం బాగా తగ్గగలదని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కౌలు రైతుల పంట రుణాలపై ప్రణబ్‌ను మీడియా ప్రశ్నించగా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నా యని తెలిపారు. ఈ యేడాది దేశావ్యాప్తంగా 3.75 కోట్ల మంది రైతులకు వ్యవసాయ పంట రుణాలను అంద చేసినట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది ఇది 3.25 కోట్లుగా ఉందని ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశ ముఖ్య నిర్ణయాలు...
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 20 శాతం పెంపు.
-ఈ కార్డుల కింద అందచేసే రుణం కూడా అదనంగా 20 శాతం పెంపు.
-మారుమూలప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవల విస్తరణ.
-2012 నాటికి సమిళివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి ప్రతి రెండు వేల జనాభాకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి.
-ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలకు ఎటువంటి పూచికత్తు లేకుండా ఆర్‌బిఐ ఆదేశాల మేరకు రుణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు బ్యాంకులు అందచేయాలి -వ్యవసాయ రుణాలను ఎటువంటి పూచికత్తు లేకుండా రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచు తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థ వంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రుల సమావేశం అభిప్రాయ పడింది.
-వివిధ ప్రభుత్వ పథకాల అమలు, రుణ లక్ష్యాలు సాధించే దిశగా ఎస్‌ఎల్‌బిసి చర్యలు చేపట్టాలి.
-గ్రామీ నిరుపేదలకు అమ్‌ ఆద్మీ బీమా యోజనా పథ కం దేశవ్యాప్తంగా వేగంగా వర్తింపచేసే విధంగా చర్యలు.
-అసంఘటిత రంగ కార్మికులకు స్వావలంభన ఫించన్‌ పథకాన్ని సమర్థవంతగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను రాష్ట్రాలకు అందచేయాలని పలువురు సీఎంలు విజ్ఞప్తి.
-రాష్ట్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాలి. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక సెల్స్‌ ఏర్పాటు చేయాలి.