|
|
మారని తీరు... దాయాదుల పోరు!
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఆగాధం ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య మాటల హోరు ఇటీవల తీవ్రతరమైన నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలలో అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగిన విలేకరుల సమావేశాలలో ఇరు దేశాల ఔత్సాహిక మీడియా ద్వైపాక్షిక సంబంధాలకు మరో కోణాన్ని జోడించింది. ఇస్లామాబాద్‌లో దె్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వా త భారత, పాక్ విదేశాంగ మంత్రులు ఎస్.ఎమ్. కృష్ణ, షా మెహమూద్ ఖురేషీలు దాదాపు అర్థరాత్రి సమయంలో సంయుక్త విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇద్దరు మం త్రులు వేర్వేరుగా తమ ప్రారంభ ప్రకటనలు తయారు చేసుకున్నారు. ఇరు పక్షాలూ కూడా చర్చలు ఉపయోగకరంగా, సుహృద్భావంతో జరిగాయని చెప్పుకొచ్చాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా అదే వైఖరి కొనసాగినప్పటికీ జవాబులు మరింత స్పష్టతను సంతరించుకోవడం ప్రారంభించాయి. పాక్‌లో అతివాద వైఖరి కలిగిన జంగ్ పత్రిక ప్రతినిధి- పాక్ విదేశాంగ మంత్రిని సూటిగా ప్రశ్నించడంతో అక్కడ వాతావరణంలో మార్పు వచ్చింది. ఆ ప్రశ్నకు ఖురేషీ చెప్పిన జవాబుతో విలేఖరుల సమావేశం 'కుక్క కాటుకి చెప్పు దెబ్బ' వంటి స్పందనలతో సాగింది. ఈ నేపథ్యంలో కృష్ణ కూడా కొన్ని సార్లు తాను చేసిన వ్యాఖ్యలకు స్పందించవలసి వచ్చింది.
ముంబై దాడులలో ఐఎస్‌ఐ జోక్యం ఉందంటూ భారత హోమ్ శాఖ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలను లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ సరుూద్ భారత వ్యతిరేక ఉపన్యాసంతో పాక్ విదేశాంగ మంత్రి పోల్చినప్పటికీ పిళె్ళైకు ఎస్.ఎం. కృష్ణ మద్దతు పలకకపోవడంపై భారత టివి ఛానెళ్ళు ఆయనపై మూకుమ్మడి దాడికి దిగాయి. కృష్ణ తో చర్చల సందర్భంలో హోం కార్యదర్శి జి.కె. పిళ్లై వ్యాఖ్యల ప్రస్తావన వచ్చిందని, అవి దురదృష్టకరమైనవంటూ కృష్ణ కూడా అంగీకరించారనే విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఖురేషీ ఆ విధంగా మాట్లాడా రు.
అయితే హఫీజ్ సరుూద్‌పై ప్రశ్నను ఖురేషీ ఈ విధంగా పక్క దోవపట్టించే ప్రయత్నం చేస్తుంటే దానిని బలవంతంగా అయినా విదేశాంగ మంత్రి నిలవరించకపోవడాన్ని చర్చలో పాల్గొన్న నిపుణులు, పదవీ విరమణ చేసిన దౌత్యవేత్తలు, ప్రతిపక్ష నాయకులు, టివీ ఛానె ళ్ళు తప్పుబట్టాయి. భారత టెలివిజన్ మీడియాలో కొన్ని వర్గాలు కృష్ణను విమర్శించగా, పాకిస్థానీ జర్నలిస్టుల నుంచి ఖురేషీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఎస్‌ఎమ్ కృష్ణ ఢిల్లీ వెళ్ళే ప్రత్యేక విమానం ఎక్కకుండానే పాకిస్థానీ విదేశాంగ మంత్రి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలూచిస్థాన్ సమస్యపై కృష్ణ స్పందనకు తగ్గట్టుగా ఆయన స్పం దించలేకపోవడాన్ని విలేకరులు చీల్చి చెండాడారు. బెలూచిస్థాన్‌లో గందరగోళాలలో భారతీయ జోక్యం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రి తీవ్రంగా తిప్పికొడుతూ, పాక్ ఈ వ్యవహారంలో ఇంత కూడా రుజువులను, ఆధారాలను చూపలేకపోయిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, కృష్ణ స్పష్టమైన ఆదేశాలతో రాలేదని, చర్చల మధ్యలో అనేక సార్లు ఢిల్లీకి ఫోన్లో మాట్లాడుతూ ఆదేశాలను అందుకోగా, పాక్ ప్రభుత్వం తరఫున చర్చించేందుకు తాను పూర్తి అధికారంతో వచ్చానంటూ ఖురేషీ మరో వివాదానికి తెరతీశారు. పాక్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను భారతీయ న్యూస్ ఛానెళ్ళన్నీ ప్రసారం చేశాయి. ఈ వ్యాఖ్యలు కృష్ణపై వ్యక్తిగత దాడిలా కనిపిస్తున్నప్పటికీ వాటిని పాక్ అంతర్గత అధికార వ్యవస్థ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. పాకిస్థాన్‌లో వివిధ అధికార కేంద్రాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. భారత్‌తో సంబంధాలు, ఇతర వ్యూహాత్మక వ్యవహారాల విషయంలో సైన్యానిదే బలమైన గొంతుక అన్న విషయమూ విదితమే. వేరే చోట నుంచి ఆదేశాలు తీసుకోవడమంటే పాక్ సైన్యం లేదా ఇంటెలిజెన్స్ సర్వీసుల జోక్యమని అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థలో సీనియర్ నాయకత్వం నుంచి చర్చల సందర్భంగా సలహాలు తీసుకోవడం చట్టసమ్మతమే కానీ అదేమీ అవమానకరమైన విషయం కాదు. పాకిస్థాన్‌లో పరిస్థితి అలా కాదు.
గత ఫిబ్రవరిలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు నిరుపమా రావ్, సల్మాన్ బషీర్‌లు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ముంబై తీవ్రవాద దాడుల అనంతరం నిలిచిపోయిన భారత్-పాక్ చర్చల తర్వాత అధికారిక స్థాయిలో జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశమది. ఇరు పక్షాలూ వేర్వేరుగా విలేకరులతో మాట్లాడాయి. పాక్ విదేశాంగ కార్యదర్శి పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి చర్చలు మంచి వాతావరణంలో జరిగాయంటూ ప్రారంభించారు. అయితే ప్రశ్నల శర పరంపర, ముఖ్యంగా పాకిస్థానీ జర్నలిస్టులు కాశ్మీర్ వగైరాల గురించి పదే పదే ప్రశ్నించడంతో విలేకరుల సమావేశం తీరు మారిపోయింది.
ఈ కారణంగా భారత పక్షం కొన్ని వ్యాఖ్యలను తిప్పి కొడుతూ మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. ఇరు పక్షాల మధ్య సంబంధాలలో ఏర్పడిన చిక్కు ముడిని విప్పవలసిన సందర్భం ఆ తీవ్రతను కోల్పోయింది. దీనితో చర్చల ప్రక్రియను పునఃప్రారంభించడానికి భూటాన్‌లోని థింపూలో జరిగిన సార్క్ సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రులు సమావేశమై ఒక అంగీకారానికి రావలసి వచ్చింది.
తిరిగి డిసెంబర్‌లో సమావేశమవ్వాలన్న నిర్ణయం తప్ప కృష్ణ-ఖురేషీల సమావేశం గొప్ప ఫలితాలను ఇవ్వలేదు. అయితే భారత ప్రజల దృష్టిలో ఖురేషీ తీవ్రమైన బహిరంగ వ్యాఖ్య లు చర్చల ప్రక్రియకు గొప్ప హాని చేశాయి. అమెరికాలో హెడ్లీ విచారణ సందర్భంగా వెల్లడైన సమాచారం పట్ల నమ్మదగ్గ చర్యలు తీసుకోవాలని భారత్ ఒత్తిడి చేస్తుండడంతో ఈ చర్చల ప్రక్రియ పురోగమించడం పాక్ సైన్యానికి ఇష్టంలేదనే ఊహాగానాలు ఉన్నాయి. ఏ ఫలితాలూ లేకుండా చర్చలు ముగియడానికి ఇదే కారణమని భారతీయ వ్యాఖ్యాతలు కొందరు అభిప్రాయపడ్డారు. కానీ మంత్రివర్గ స్థాయి సమావేశం చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వనప్పటికీ ద్వైపాక్షిక చర్చలను ప్రజాగ్రహం చేసినంత ధ్వంసం అది చేసి ఉండేది కాదు. చర్చలలో పాల్గొన్న అధికారులను చర్చలపై తరచి తరచి అడిగి, వారు తమ ప్రామాణిక వైఖరిని ఉద్ఘాటించే హైవోల్టేజ్ వాతావరణంలో భారత్-పాక్ దె్వైపాక్షిక చర్చలు జరగవచ్చా అనే ప్రశ్న కొన్ని వర్గాలలో వినిపిస్తున్నది. సున్నితమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తమ కీలకవైఖరిని బహిరంగంగా పునరుద్ఘాటించడం వాతావరణాన్ని నీరుగారుస్తుంది. ఎందుకంటే ఇరు పక్షాలూ కూడా తమ వైఖరులను తీవ్రంగా వెల్లడించేలా ఒత్తిడి వారిపై ఉంటున్నది.
సున్నితమైన అంశాలపై వ్యాఖ్యానించకుండా చర్చల ఫలితాల గురించి మాత్రమే మాట్లాడేలా అధికారులు తమను తాము అదుపులో ఉంచుకునే మార్గం ఏమైనా ఉన్నదా? భారత్-పాకిస్థాన్‌ల మధ్య అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిన విశ్వాస రాహిత్యం ప్రస్తావన గత దె్వైపాక్షిక చర్చలలో వచ్చింది. ఇరు దేశాల మధ్యగల విశ్వాస రాహిత్యాన్ని పెంచడంలో, తగ్గించడంలో మీడియా కీలక పాత్ర పోషించగలదు. ఇటీవల జరిగిన చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలలో వెనుకడగు అని టెలివిజన్ రిపోర్టిం గ్, నిపుణుల విశ్లేషణ పేర్కొంది. అయితే ఈ సమావేశానికి కూడా వెండి అంచులు ఉన్నాయని, ఇరు పక్షాలూ అధికారికంగా చర్చలు జరపడం, ఈ సంవత్సరాంతానికి మరో సమావేశం జరిగే అవకాశం ఉండటాన్ని విజ్ఞులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇస్లామాబాద్ అంకం తో ఏర్పడిన సమస్యలను తుడిచి వేయడానికి కృషి అవసరం.
|
|
|