న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఓటేయాలంటే గుర్తింపు తప్పనిసరి

ఆదిలాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో నిర్వహించు ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డు లేని ఓటర్లు ఎన్నికల కమిషన్‌ ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్ధేశంతో 16 రకాల గుర్తింపుల ఫోటో కార్డులను అనుమతించిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు కార్డులేని ఓటరు ఓటుహక్కు వినియోగించుకోవడానికి పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్‌కామ్‌టాక్స్‌ ఫాన్‌ కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సెక్టార్‌,పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెని ద్వారా జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, 31 మే నాటి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి అధార్టి వారు జారి చేసిన గుర్తింపు కార్డులు, పించన్‌ గుర్తింపు కార్డు, స్వాతంత్ర్య యోధుల గుర్తింపు కార్డు, ఆయుధలైసెన్స్‌, వికలాంగుల గుర్తింపు కార్డు, ఆరోగ్య భీమా కార్డు, పట్టా రిజిష్టర్‌ ఫోటోతో ,ఉపాధి హామీ జాబ్‌కార్డు, రేషన్‌ కార్డు, ఎటిఎం, పట్టాపాసుబుక్‌లలో ఈ 16 కార్డులలో ఏదేని ఒక దానిని పోలింగ్‌ కేంద్రాలలో చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు.