|
|
బ్యాంకర్లకు ఆదిలాబాద్ కలెక్టర్ ఆదేశాలు
ఆదిలాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): ఈ నెల 31వ తేదీలోగా జిల్లాకు నిర్ధేశించిన స్థాయిలో రైతులకు పంట రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో పత్తి ముఖ్యమైన పంట అవడం వలన అధికంగా రైతులు పత్తి రైతులే కావడం వలన పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరగా రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. పంటరుణాల రీషెడ్యూల్ కూడా ఈనెల 31 వ తేదీలోగా పూర్తవ్వాలని ఆదేశించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ లబ్దిదారులకు కూడా రుణాలను అందించాలని అన్నారు. బ్యాంకులు రుణాలు అందించక పోవడం వలన రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతారు కాబట్టి అధికారులు వెంటనే రుణాలను అందించాలని అన్నారు. జిల్లాలో పత్తి పంటకు వాతావరణం భీమా అమలులో ఉన్నందున బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలను పొందే రైతులంతా ఈ నెల 31 లోగా తప్పనిసరిగా పంట భీమా చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ కె.వీరమల్లు, ఎల్‌డిఎం అశోక్ కొండల్వార్, జెడిఎ రామచంద్రరావు, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
|