న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
18 కుటుంబాలకు శాశ్వత పునరావాసం

ఆదిలాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): కాసిపేట మండలం కుర్రెఘాట్‌ నుండి వెంకటాపూర్‌ ఆశ్రమ పాఠశాలకు తరిలించిన 18 కుటుంబాలకు శాశ్వత పునరావాసం కల్పించనున్నామని జిల్లా కలెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కుర్రెఘాట్‌ కుటుంబాలకు వెంకటాపూర్‌ గ్రామంలో 2 ఎకరాల స్థలములో ఇందిరమ్మ హౌజింగ్‌ పధకం కింద 18 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశామని, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా సిమెంటు రేకులతో నిర్మించిన కమ్యూనిటి హాలులో అదేస్థలములో మార్చనున్నామని తెలిపారు. వారికి అన్ని మౌళిక సదుపాయాలు కల్పించుతున్నాని, ఒక బోరింగ్‌ వేయించడం జరిగిందని, కరెంటు సౌకర్యం కొరకు పనులు చేపడుతున్నామని, పిల్లలకు చదువులు చెప్పించడానికి ఒక టీచరును నియమించడం జరిగిందని తెలిపారు. 18 కుటుంబాలకు అతి త్వరలో 50 వేల రూపాయల ఖర్చుతో ఇందిరమ్మ గృహాలు నిర్మించనున్నామని తెలిపారు. కలెక్టర్‌తోపాటు హౌజింగ్‌ పిడి శేషసాయి ఉన్నారు.