న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
రాయల ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు

అనంతపురం, జులై 20 (ఫీచర్స్ ఇండియా): శ్రీకృష్ణదేవరాయ పంచశతాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈనెల 21 వతేది గుత్తి (తాలుకాస్థాయిలో) నీరే ప్రాణాధారం జీవనోపాధి, సంస్కృతి రాయల కాలంనాటి నీటి వనరులు - అనెడి అంశంపై వై వి మల్లారెడ్డి అర్డీటి ఎకాలజీ సెంటరు డైరక్టరు,వారిచే సదస్సు జరుగును . రాయదుర్గం నందు డి .మైఖేల్‌ బాబు , అధ్యక్షులు, అనంతరంగస్థల కళాకారుల సంఘం కళాకారులచే జానపద నృత్యం, బుర్రకథ, విజయభవనం నాటకం ప్రదర్శింపబడునని జిల్లా కలెక్టరు డా బి జనార్థనరెడ్డి ఒకప్రకటనలొ తెలిపారు . శ్రీకృష్ణదేవరాయల పరిపాలన , నీటివనరుల సంరక్షణకై గైకొన్న చర్యలు, పద్దతులు, సాహిత్య,కళాపోషణ ,మతసామరస్యానికి కృషి జరిపిన విధానాలను తెలుసుకొనుటకు జిల్లా యంత్రాంగంచే నిర్వహించే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ తిలకించాలని కలెక్టరు ఆ ప్రకటనలో తెలిపారు.