న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్


శ్రీకాకుళం, జులై 20 (ఫీచర్స్ ఇండియా): సోంపేట ధర్మల్‌ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమ ఘటనలో నష్టపోయిన జర్నలిస్టులును ఆదుకోవాలి శ్రీకాకుళం జూలై 20ః సోంపేట ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణపనులలో జరిగిన విద్వంసకాండలో, క్షతగాత్రులైన ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, విలేకర్లును ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్టు సంఘాలు ఆద్వర్యంలో జిల్లా కలెక్టరు నాగులాపల్లి శ్రీకాంత్‌కు మంగళవారం ఉదయం వినతిపత్రం అందించారు. జిల్లా చరిత్రలో మీడియా ప్రతినిధులుపై దాడిజరగడం, ఎన్నడూ జరగలేదని, మానవతా దృక్పధంతో ఆదుకోవాలని జిల్లా జర్నలిస్టు సంఘం నాయుకులు కలెక్టరును కోరారు. సోంపేట ఘటనలో తీవ్రగాయాలుతోపాటు, కెమోరాలు, ద్విచక్రవాహనలు, ద్వంసంకావడంతో, నప్టపరిహారం అందించాలని కోరారు. జర్నలిస్టులకు సోంపేట సంఘటనలో జరిగిన నష్టంపై ప్రభుత్వనికి నివేదించి తగిన విధంగా సహయపడతామని జిల్లా కలెక్టరు నాగులాపల్లి శ్రీకాంత్‌ చెప్పారు. జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా అసోయేషన్‌ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్‌ సంఘం నాయుకులు, ఎన్‌.జోగినాయుడు, ఎన్‌,ధర్మారావు, కె.వేణుగోపాల్‌, ఎన్‌.ఈశ్వరరావు, షేక్‌ అబ్దుల్లాతోపాటు, వివిధ ఛానల్‌ ప్రతినిధులు, పాల్గొన్నారు. స్కానింగ్‌ సెంటర్లపై తనిఖీలు చేయండిః కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా శ్రీకాకుళం జూలై 20ః గర్బస్దు పిండలింగ నిర్దారణకేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబసంక్షేమశాఖ కమీషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా అన్నారు. మంగళవారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీనెల స్కానింగ్‌ సెంటర్లపై తనిఖీలు నిర్వహించాలని సుంచించారు. స్కానింగ్‌ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమంగా స్కానింగ్‌ నిర్వహించే వారిపై కేసులు నమోదుచేసి జరిమానాలు విదించాలని పేర్కొన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది, సీజనల్‌ వ్యాదులపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ బుధవారం, శనివారం నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాన్ని ఇకమీదట వారానికి ఒక్కసారి బుధవారం మాత్రమే నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రిసమన్వయాధికారి, జిల్లా వైద్యాధికారితో సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పారు. జిల్లాలో రక్తనిధికేంద్రాలు సక్రమంగా పనిచేసాలా చర్యలు చేపట్టాన్నారు. స్టేట్‌ పాపులేషన్‌ పాలసీనిధుల వ్యయంపై ఆడిట్‌ నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డా,,బి.విజయసారధి, డి.సి.హెచ్‌ డా,,బి.శివప్రసాద్‌, డి.ఎల్‌.ఓ.డా,,జి.రత్నకుమారి, పి.ఓ, డి.టి.టి డా,,బి.జగన్నాధరావు, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, అప్పలనాయుడు, సైలజ రమణమూర్తి, 104 వాహనం కో-ఆర్డినేటర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.