|
|
మన్యంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యుల పర్యటన
శ్రీకాకుళం, జులై 20 (ఫీచర్స్ ఇండియా): శ్రీకృష్ణ కమిటీ సభ్యులు అబూసలేషరీష్ , కన్సల్టెంట్ జోషిలు మంగళవారం పాలకొండ మండలం సీతంపేట మండలాలలో పర్యటించారు. సీతంపేట మండలం కిండంగి గిరిజన గ్రామ్నా సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నదీ లేదీ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ గృహాలు,పావలావడ్డీ రుణాలు, పింఛనులు ఉపాధిహామీ తదితర పథకాలు తమకు అందుతున్నాయ గ్రామస్ధులు తెలిపారు. ఆసుపత్రి ప్రసవాలపై అడుగగా ఇదివరలో అవగాహన లేక ఇంటివద్దనే ప్రసవాలు జరిగేవd ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయ గ్రామస్ధులు తెలిపారు. రోడ్ల సదుపాయాలు ప్రభుత్వం కలిగించి తమకు సౌకర్యంవంతమైన రహదారి ర్మించారd వేసవిలో తీవ్ర మంచీటి ఇబ్బందికి గురికాబడుతున్నామ తెలిపారు. తెలంగాణాపై వారి అభిప్రాయాలు తెలపమనగా ఒకరిద్దరికి తప్ప తెలంగాణా అంటే ఏమిటో తెలియదన్నారు. సర్పంచ్ ముఖలింగ్నా పంచాయితీకి ధులు విడుదలపై ప్రశ్నించగా, ఉపాధి హామి మిత్తం 90 లక్షలు రహదారి సౌకర్యాకి 2 కోట్ల రూపాయలు ప్రత్యేక ధులు మంజురైనట్లు తెలిపారు. గ్రామ కమిటీ సభ్యులతో వారు గ్రామాభివృద్ధికోసం చేస్తున్న పనులపై ఆరాతీసారు. గిరిజనుల ముఖ్య పంటలైన అల్లం, పసుపు, అనాస, తదితర పంటలకు సరైన మార్కెట్ సదుపాయం లేదని తెలిపారు. అసంపూర్తిగా వున్న గృహాలను పర్యవేక్షించగా, ఇళ్ల ర్మాణం పూర్తి స్ధాయిలో జరగడాకి కdసం 70 వేల రూపాయలు కావలసివుంటుంద ఐసిడిఎ ప్రాజెక్టు అధికారి బాబూరావునాయుడు తెలిపారు. గిరిజన మహిళలలో సమావేశమై వారి వృత్తి, ఆదాయ మార్గాలు, కుటుంబ నేపధ్యాలపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఆర్డీఓ బి.బాలసుబ్రహ్మణ్యం, ఐటిడిఏ. ప్రాజెక్టు అధికారి బాబురావునాయుడు తదితరులు పాల్గొన్నారు.
|
|
|