|
|
చిక్కోలులో శ్రీకృష్ణ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ
శ్రీకాకుళం, జులై 20 (ఫీచర్స్ ఇండియా): రాష్ట్ర విభజన అంశంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ జిల్లాలోని వివిధ వర్గాల వారి నుండి బుధవారం మధ్యాహ్నం 4.30 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశమందిరంలో అభిప్రాయాలను సేకరించనున్నట్టు జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ముందుగా అనుమతి పొందిన వారికి, వివిధ రాజకీయ పక్షాలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, ఉద్యోగ సంఘాల వారికి ఈ సమావేశంలో కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని చెప్పుకోనే అవకాశం కల్పిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులు ముందు జిల్లాలో కొన్ని గ్రామాలను సందర్శించి క్షేత్రస్ధాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 4.00 గంటలకు జిల్లా అధికారులతో చర్చిస్తారని తెలిపారు.
|
|
|