|
|
దాడికి గురైన ఎస్సీలకు ఆర్థిక సహాయం
వరంగల్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): 1989 ఎస్.సి., ఎస్.టి., దాడుల నివారణ చట్టం ప్రకారం ఇతర వర్గాల నుండి కుల పరంగా దాడికి గురై తీవ్రంగా నష్టపోయిన షెడ్యుల్ కులాల బాదితులకు డా.అంబేద్కర్ జాతీయ రిలీఫ్ పథకం క్రింద ఆర్థిక సహయం అందించడానికి అంబేద్కర్ పౌండేషన్ న్యూడిల్లి వారు ధరఖాస్తులను కోరుచున్నారని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం క్రింద బాదితులు లేదా బాదిత కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల వరకు ఆర్థక సహయం ఆ సంస్థ నేరుగా అందజేస్తుంది. బాదితులు లేదా బాదిత కుటుంబ సభ్యులు తగు ఆధారాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ధరఖాస్తును పంపవలసినదిగా కోరుచున్నారు. ఇతర వివరాలకు కార్యాలయ పని వేళలో సంప్రదించవచ్చు.
|
|
|