|
|
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇదే!
వరంగల్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): ఉప ఎన్నికల సందర్బంగా వివధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలకు వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. అందులో పోందుప రిచిన ఎన్నికల అపరాధాలు అంశానికి సంబంధించిన సూచనలను అభ్యర్థులు, కార్యకర్తలు తప్పని సరిగా పాటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. 1. ఎన్నికల అపరాధాలలో ప్రధానమైనవి ఎన్నికల సందర్బంగా విద్వేషాలు రెచ్చ గొట్టడం, తప్పుడు ధృవీకరణలు ఇవ్వడం, పోలింగ్ కు ముందు 48 గంటల కాలంలో బహిరంగ సమావేశాలు నిర్వహించడం, పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రచారం చేయడం, సక్రమంగా ప్రవర్తించక పోవడం ప్రధానమైనవి. 2. ఎన్నికలకు సంబంధించిన ఎ విషయాన్ని కూడా పోలింగ్ తేదీకి ముందు 48 గంటల కాలపరిమితిలో సినిమా ద్వారా గాని, టీవి మరే పరికరం ద్వారా గానీ ప్రదర్శించకూడదు. ప్రచారం కోసం ప్రజల్ని ఆకర్షించే విధంగా ఎటువంటి నాటక, సంగీత, వినోద కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఈ అపరాదం చేసిన వారి రెండేళ్ల వరకు జైలుశిక్ష గాని లేదా జరిమానా గాని లేదా రెండూ గాని విధించవచ్చు. 3. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి కరపత్రం గాని, పోస్టరు గాని దానిపైన ఆ కరపత్రాన్ని ముద్రించిన , ప్రచురించిన వారి పేరు, చిరునామాలు లేకుండా ముద్రించకూడదు అటువంటి కరపత్రాలను, పోస్టర్లను ఎవరు ప్రచురించదలుచుకున్నారో ఆ ప్రచురణ కర్త తన గురించిన ఒక ధృవీకరణను ఇద్దరు సాక్షులు ద్వారా ధృవీకరించుకుని ప్రింటర్ కు రెండు కాపీలు ఇస్తే తప్ప ఎ కరపత్రం, పోస్టరు కూడా ముద్రించకూడదు. అలాగే అటువంటి ప్రతాలను ముద్రించిన వెనువెంటనే ఆ ముద్రాపకుడు అటువంటి ధృవీకరణ పత్రాన్ని ఒకదాన్ని జిల్లాల్లో జిల్లా మెజిస్ట్రేట్‌కు, రాష్ట్ర రాజదానిలో అయితే ప్రధాన ఎన్నికల అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఈనియమావళిని ఉల్లంఘించిన వారికి 6 నెలల దాకా జైలు శిక్ష గాని రూ.2000లు జరిమానా గాని లేదా రెండు విధించవచ్చు. 4. పోలింగ్ జరుగుతున్న రోజున పోలింగ్ స్టేషన్ లోపల గాని , దగ్గర గాని, లేదా పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో పబ్లిక్ స్థలంలో గాని, పై#్రవేటు స్థలంలో గాని ఎవరూ ఓట్ల కోసం ప్రచారం చేయకూడదు ఎన్నికల నిర్వహణకు సంబందించిన అధికారిక ప్రకటనలు తప్ప మరే ఇతర ప్రకటనలను చిహ్నలను ప్రదర్శించకూడదు. ఇటువంటి అపరాధమేదైనా చేసినట్లయితే అందుకు 250 రూపాయల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. 5. పోలింగ్ జరిగే రోజున పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రిసైడింగ్ అధికారి సూచించే చట్ట బద్దమైన నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకొని పక్షంలో ఎ ఒక్క వ్యక్తినైనా అక్కడి నుండి తొలగించవచ్చు. అయితే ఈ అధికారాలు పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడానికి వచ్చే ఓటరును ఓటు వేయకుండా నిరోధించ డానికి మాత్రం వాడుకోకూడదు ఒకవేళ అలా దూరంగా తొలగించబడ్డ ఆ వ్యక్తి ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేకుండా మళ్లీ పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించబోతో అతన్ని మూడు నెలల పాటు జైలుకు పంపవచ్చు లేదా జరిమానా లేదా రెండు విధించవచ్చు. 6. ఎవరైనా ఓటరు బ్యాలెట్ పేపర్ తీసుకున్న తరువాత తనకు ఇచ్చిన బ్యాలేట్ పేపరులో ఓటు వేయడానకి నిర్దేశించబడ్డ పద్దతి పాటించడానికి నిరాకరిస్తే ఆ బ్యాలెట్ పేపరును రద్దు చేయవచ్చు. 7. ఎన్నికల బాధ్యతలు అప్పగించబడ్డ అధికారి తన బాధ్యతను నెరవేర్చ డంలో విఫలం చెందినా, తప్పు చేసినా 500 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 8. పోలింగ్ స్టేషన్ లోపలకు గాని, పరిసరాల్లో గాని పోలింగ్ బాద్యతలు నెరవేరుస్తున్న అధికారులు తప్ప మరెవరైనా ఆయుదాలతో ప్రవేశించిన ట్లయితే అందుకు వారికి రెండేళ్ల దాకా జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండు విధించవచ్చు. 9. పోలింగ్ స్టేషన్ నుండి ఎ వ్యక్తి అయినా సరే అనధికారికంగా బ్యాలెట్ పేపర్లు బయటకు తీసుకు పోయినా , తీసుకుపోవడానికి ప్రయత్నించినా అటువంటి ప్రయత్నానికి సహకరించినా ఎడాది దాకా జైలు శిక్ష, 500 రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. 10. ఎన్నికల అపరాధాల్లో చాలా ముఖ్యమైన అపరాధం పోలింగ్ బూత్ లను చేజిక్కించుకోవడం అంటే పోలింగ్ స్టేషన్‌ను ముట్టడించడం, పోలింగ్ అధికారుల దగ్గర నుండి బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ యంత్రాలు లాక్కొవడం లేదా ఎన్నికలు సక్రమంగా జరగకుండా అడ్డుపడే ఎటువంటి ప్రయత్నమైనా చేపట్టడం దీనికి ముడేళ్ల వరకు జరిమానాతో కూడిన జైలు శిక్ష విధించవచ్చు. 11. పోలింగ్ పరిసమాప్తి చెందడానికి 48 గంటల ముందు నుండి పోలింగ్ ప్రాంతాల్లో ఎక్క మాదక ద్రవ్యాలను అమ్మకూడదు, ఇవ్వకూడదు, పంచకూడదు అలా చేసిన వారికి 6 నెలల జైలు శిక్ష , 2000 వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. 12. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సంబంధించిన కవర్లను గాని, ధృవీకరణ పత్రాలను గాని లేదా బ్యాలెట్ పేపర్ల పైన ఉండే అధికారిక ముద్రలను కాని లేదా బ్యాలెట్ పేపర్లను కాని తారు మారు చేయడం లేదా ధ్వంసం చేయడం కూడా ఎన్నికల అపరాధమే బ్యాలేట్ పెట్టెలను లేదా బ్యాలెట్ పత్రాలను అనధికారికంగా తెరవడం, తీసుకోవడం, ధ్వంసం చేయడంఅపరాధం దీనికి సహకరించడం అపరాధం చేస్తున్న వారి గురించిన సమాచారాన్ని దాచి ఉంచడం కూడా అపరాధమే దీన్నీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులయినట్లయితే వారికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా రెండు విధించే అవకాశం ఉంది. ఇతరులు అయితే 6 నెలలు వరకు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది.
|
|
|