|
|
వరంగల్ యూనిట్‌లో కోర్టు అసిస్టెంట్ల భర్తీ
వరంగల్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): వరంగల్ యూనిట్‌లో కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ పోస్టులకు అరహత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి అశోక్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, పరకాల , నర్సంపేట , మహబుబాబాద్ మరియు జనగాం లలో కొత్తగా ఎర్పాటు కాబడిన స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టులో సమర్థవంతంగా పనిచేయుట పోస్టులకు అభ్యర్థులను నియమించే ప్రక్రియ చేపట్టినట్లు ఆయన తెలిపారు. కోర్టు అసిస్టెంట్స్‌ః నర్సంపేట, పరకాల, మహబుబాబాద్ మరియు జనగాం లలో ఒక్కొటి చొప్పున ఖాళీగా గల ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినీస్టీరియల్ సర్వీసులో గాని లేక ఎ.పి. హైకోర్టు సర్వీసులో అసిస్టెంట్, ఎగ్జామినల్, టైపిస్టు, కాపీయిస్ట్ మరియు పై బడిన పోస్టులో పని చేసి రిటైరైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనుటకు అరుహులని ఆయన తెలిపారు. పై విధంగా తెలిపిన అభ్యర్థులు లభ్యం కాని పరిస్థితులలో ఎ.పి. స్టేట్ బోర్డు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్ష లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన 65 సంవత్సరాలు మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనవచ్చునని తెలిపారు. గౌరవ వేతనం హనరోరియం గా నెలకు 1500 ల రూపాయలు ఈ పోస్టుకు ఇస్తారని తెలిపారు. కోర్టు అటెండెంట్స్‌ః పరకాల, జనగాంలలో ఖాళీగా గల ఒక్కొ పోస్టుకు హైకోర్టు , సబార్డినేట్ కోర్టు లలో లాస్ట్‌గ్రేడ్ సర్వీసులలో ఎదేని పోస్టు చేసి పదవి వివరమణ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని, ఒక వేళ వారు లభ్యం కాని పరిస్థితులలో 65 సంవత్సరంల లోబడి వుండి, సైకిల్ తొక్క కల్గి 7వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు నని తెలిపారు. స్థానిక అభ్యర్థులు అనగా కోర్టు వున్న ప్రదేశంలో నివసించే వారికి ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందని, వీటికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరగదని తెలిపారు. అరహతలు గల వారు సంబందిత కోర్టులలో తేదిః30-7-2010 సాయంత్రం 5 లోపు తమ దరఖాస్తులు సమర్పించుకోవాలని ఆ ప్రకటనలో ఆయన వివరించారు.
|
|
|