|
|
పోలింగ్ ఏజెంట్లకు లాటరీ పద్దతిన సమయం
వరంగల్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఉప ఎన్నిక బరిలో స్వతంత్ర అభ్యర్థులు అధికంగా వుండటం వలన రాష్ట్ర ఎన్నికల కమీషన్ సూచనల మేరకు పొలింగ్ మరియు కౌంటింగ్ ఎజెంట్ల సమయానికి రాండమైజేషన్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హలులో కేంద్ర ఎన్నికల పరిశీలకులు రాజ్‌నారాయణస్వామి, జిల్లా ఎన్నికల అధికారి ఎన్.శ్రీధర్ , జిల్లా ఎస్పీ షాన్‌వాజ్ ఖాసీమ్ లు పాల్గొన్న ఈ ర్యాండమైజేషన్‌లో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పోలింగ్‌ఒ ఎజెంట్ల పేర్లను లాటరీ పద్దతిని తీసి వారి సమయాన్ని వినిపించారు. ప్రతి అర గంటకు నలుగురు చొప్పున మొదటి అయిదు గంటలకు 40 మంది అభ్యర్థుల ఎజెంట్లకు కేటాయించిన సమయాన్ని తెలియజేసారు. పోలింగ్ లో తదుపరి అయిదు గంటలకు మిగిలిన 30 మందికి అభ్యర్థుల ఎజెంట్లకు లాటరి పద్దతిన సమయాన్ని కేటాయించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉపఎన్నికలో పోటీ పడటంతో ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఈ లాటరీ పద్దతిన వారి ఎజెంట్లకు సమయాన్ని కేటాయించడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో వుండే ఎజెంట్లకు పాస్ జారీ కొరకు ఈ నెల 24 న తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని పోటీలోనున్న అభ్యర్థులను కోరారు. ఒక్కొ ఎజెంట్ కి అరగంట చొప్పున పోలింగ్ స్టేషన్‌లో ఉండేందుకు సమయం కేటాయించి అందరికి సమాన అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఇదే పద్దతిన కౌంటింగ్ కు వర్తింపజేస్తామని ఎన్నికల అధికారి తెలిపిన అనంతరం, రిటర్నిం గ్ అధికారిపోటీ అభ్యర్థుల ఎజెంట్లకు కౌంటింగ్ కేంద్రాలలో వుండే సమయాన్ని లాటరీ ద్వారా కేటాయించారు. అభ్యర్థుల ఎజెంట్లకు కేటాయించిన సమయాన్ని సంబందిత అభ్యర్థులకు పంపించడం జరుగుతందని జిల్లా ఎన్నికల అధికారి ఎన్.శ్రీధర్ వివరించారు. కార్యక్రమంనకు జిల్లా రెవెన్యూ అధికారి పి.శేషాద్రి కూడా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోటీలో నున్న పలువురు స్వతంత్ర్య అభ్యర్థులు పాల్గొన్నారు. అంతకు ముందు పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌ను అభ్యర్థుల సమక్షంలో చూపించి సీల్ చేసారు.
|
|
|