|
|
27న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
వరంగల్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో జరుగనున్న వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఉపఎన్నిక దృష్ట్యా ఈ నెల 27వ తేదీన ఆ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎన్.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ జరుగనున్న జులై 27న తేదీ మంగళవారం నాడు వరంగల్ పశ్చిమ నియోజక వర్గ పరిధిలో నెగొషిబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం క్రింద కూడా అదనపు సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు.
|
|
|