న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్‌ రిజిస్ట్రార్‌

హైదరాబాద్‌, జులై 20 (ఫీచర్స్ ఇండియా): కో-ఆపరేటివ్‌ సొసైటీ అడిషనల్‌ రిజిస్ట్రార్‌ అమరేందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. బేగంపేట, అంబర్‌పేటలోని ఆయన నివాసాలతో పాటు నల్గొండలోని బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు చేశారు. అధికారుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడినట్లు సమాచారం. కాగా కర్నూలు జిల్లా నంద్యాలలో రుద్రవరం తహసీల్దార్‌ సుబ్బరాయుడు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. సోదాలు కొనసాగుతున్నాయి.