న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు

వరంగల్, జులై 19 (ఫీచర్స్ ఇండియా): ఉప ఎన్నిక సందర్బంగా ఈ నెల 27 న జరిగే పోలింగ్‌ రోజు వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు క్రింది సూచనలను పాటించాలి ఎన్నికల సంఘం క్రింద ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పొందుపరిచింది. • ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి, ప్రశాంతంగా పోలింగ్‌ జరగటానికి ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులకు అభ్యర్థులు సహరించాలి. • వివిధ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన బాడ్జీలు లేదా గుర్తింపు కార్డులను సంబంధిత అభ్యర్థులు ఇవ్వాలి. • ఓటర్ల కిచ్చే గుర్తింపు స్లిప్‌ లు తెల్లకాగితాలై ఉండాలి కాని వాటి మీద చిహ్నం, అభ్యర్థి లేదా పార్టీ పేరు ఉండకుండా చూడాలి. • పోలింగ్‌ రోజున అంతకు నాలుగు గంటల ముందు సారా, కళ్లు లాంటి మధ్యాన్ని పంచటాన్ని పరిహరించాలి. • పోలింగ్‌ బూత్‌ల ముందు రాజకీయ పక్షాలు, అభ్యర్థులు నిర్వహించే శిభిరాల దగ్గర అవసరంగా జనం గుమికూడకుండా చూసుకోవాలి. • శిభిరాల వద్ద ఎలాంటి పోస్టర్లు, జెండాలు, చిహ్నలు లేదా మరేలాంటి ప్రచార వస్తువులను ప్రదర్శించరాదు. తిండి పదార్థాలను అందించకూడదు. • పోలింగ్‌ రోజున వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నడిపించే వాహనాలపై విధించిన నిబంధనలను కట్టుబడి ఉండేటట్లు అధికారులకు సహకరించాలి. వాటి కోసం అనుమతులు పొందాలి. ఆ అనుమతులను స్పష్టంగా కనపడేటట్లు వాహనాలపై ప్రదర్శించాలి. పోలింగ్‌ బూత్‌ ఓటర్లు తప్ప, మరెవరూ, ఎన్నికల సంఘం నుండి తగిన పాసులేకుండా పోలింగ్‌ బూత్‌లలోకి ప్రవేశించరాదు. పరిశీకులు ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల దృష్టికి ఎన్నికల నిర్వహణ విషయంలో స్పష్టమైన ఫిర్యాదు లేదా సమస్యలు ఉంటే అభ్యర్థులు, పార్టీ పోలింగ్‌ ఎజెంట్లు తీసుకెళ్లవచ్చు.