న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
25న ప్రతిభ పురస్కార్‌ అవార్డులు

చెన్నై, జులై 18 (ఫీచర్స్ ఇండియా): ఈనెల 25వ తేదీన టి.నగర్‌లోని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్‌ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ పురస్కా ర్‌ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. టీటీకే రోడ్డులోని మ్యూజిక్‌ అకాడమీలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన డాక్టర్‌ పద్మ వీరపనేని (కెమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ హైదరాబాద్‌), ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌-2009 ఏపీ టాపర్‌ డాక్టర్‌ నారాయణ భరత గుప్త, 2009 మహి ళా ఏపీ టాపర్‌ అమ్మ పాలకాటో, కార్తికేయగోయల్‌, సిహెచ్‌.విజయరావు, దాసరి హరి చరణ్‌, అనుముల జితేంద్రరెడ్డి, చింతకింది మల్లేశం (రాష్ట్రపతి అవార్డు గ్రహీత) తదితరులకు ప్రతిభ పురస్కార్‌ అందజేస్తారని వెల్లడించారు. రెండవసారిగా తమ అసోసియేషన్‌ ప్రతిభా పురస్కార్‌ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ సమైఖ్యతను చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రముఖ కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి ఎన్‌.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.