|
|
ఉప ఎన్నికల ప్రచారానికి 'మహా' బృందం
నిజామాబాద్, జులై 17 (ఫీచర్స్ ఇండియా): తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సంఘీభావ వేదిక (టీఆర్‌ఎస్‌ఎస్‌వీ) సిద్ధమయింది. మహారాష్ట్ర రాజధాని ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ఎస్‌వీ తరఫున ఎనిమిది మందితో కూడిన ప్రతినిధి బృందం ఉప ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఆదివారం నుంచి ఈ బృందం నిజామాబాద్ జిల్లాలో ప్రచారం చేయనుంది. ఈ నెల 18న నిజామాబాద్ అర్బన్, 19న ఎల్లారెడ్డి, 20న వేములవాడ, సిరిసిల్ల, 21న సిద్దిపేట, 22న హుజురాబాద్, వరంగల్, 23న మంచిర్యాల్, ధర్మాపురి, 24న చెన్నూరు, సిర్పూరు, 25న కోరుట్ల నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ఎస్‌వీ సమన్వయకర్త బి. హేమంత్‌కుమార్ తెలిపారు. ఉప ఎన్నికల్లో గతంలో తమ పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ముంబై నుంచి వస్తున్న ప్రతినిధి బృందంలో తనతో పాటు నరేష్ గౌడ్, సిరిపురం రాజేశం, బొల్లే శివరాజ్, బి.ర వీంద్రం, కె యోగేందర్, అంకుష్ తదితరులున్నారని తెలిపారు. ఈ ప్రతినిధి బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు హేమంత్ వెల్లడించారు.
|
|
|