|
|
జాతీయ హాకీ టోర్నీలో ఆర్మీ జట్టు విజయం
చెన్నై, జులై 17 (ఫీచర్స్ ఇండియా): చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరుగుతున్న 86వ ఎంసీసీ మురుగప్పా జాతీయ హాకీ టోర్నమెంటులో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ప్రస్తుత చాంపియన్ ఆర్మీ జట్టు విజయం సాధించింది. నామ్‌దారీ జట్టును 4-2 స్కోర్‌తో ఆ జట్టు ఓడించింది. ప్రారంభం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో గోల్స్ చేసేందుకు ఇరు జట్లు హోరాహోరీ పోరాడాయి. మూడవ నిమిషంలో పెనాల్టీ కార్నర్ దక్కించుకున్న నామ్‌సారీ జట్టు హర్‌ప్రీత్‌సింగ్ ద్వారా 1-0 ఆధిక్యత దక్కించుకుంది.
తర్వాత ఆర్మీ జట్టు కూడా పెనాల్టీ కార్నర్ దక్కించుకుని రేవత్‌సింగ్ ద్వారా గోల్ సాధించి 1-1 స్కోర్‌తో సమం చేసింది. 25వ నిమిషంలో ఆర్మీ మరొక పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి 2-1 ఆధిక్యత దక్కించుకుంది. ఒత్తిడికి గురైన నామ్‌సారీ జట్టు మరొక పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి ఆర్మీ జట్టుతో 2-2 స్కోర్‌తో సమానమైంది. ఆర్మీ జట్టు 41వ నిమిషంలో ఇరాక్రా ద్వారా గోల్ సాధించి 3-2 ఆధిక్యత దక్కించుకుంది. 64వ నిమిషంలో ఆర్మీ జట్టు ఎస్‌వి.సునీల్ ద్వారా మరొక గోల్ సాధించి 4-2 ఆధిక్యత దక్కించుకుంది. ఆర్మీ జట్టు లీగ్ దశలో తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.
|
|
|