|
|
అభివృద్ధి పనుల పరిశీలనకు అధికారులు
మెదక్, జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో నియోజక వర్గ స్థాయి అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి నియామకమైన అధికారులలో కొన్ని మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ యస్. సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నియోజక వర్గానికి గృహా నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె.బాల్‌రెడ్డిని, దుబ్బాక నియోజక వర్గానికి డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి అనురాధాలను నియోజక వర్గ స్థాయి అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు తమ నియోజక వర్గంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలు అమలు చేయడంలో మండల స్థాయి ప్రత్యేకాధికారులు, మండల తహాసీల్ధార్లు, మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు, మండల స్థాయి ఇతర అధికారుల సమన్వయంతో పని చేస్తూ, పూర్తి ప్రగతి నివేధికలను జిల్లా కలెక్టర్‌కు పంపాలని ఆయన సూచించారు.
|
|
|