|
|
క్రిష్టియన్ విద్యార్థులకు ఉపకార వేతనాలు
మెదక్, జులై 16 (ఫీచర్స్ ఇండియా): ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న క్రిష్టియన్ మైనారిటీ విద్యార్థుల నుండి 2010-2011 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ప్రిమెట్రిక్ స్కాలర్ షిప్‌లకు ధరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర క్రిష్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పోరేషన్ మేనెజింగ్ డైరెక్టర్ జె.ఆర్.సుధీర్ నేడొక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారుల నుండి గాని వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి చేసిన ధరఖాస్తులను ఈ నెల 25లోగా పోస్టు బాక్స్ నెం. 90, ఖైరతాబాద్, హైదరాబాద్- 500 004 చిరునామాకు పంపాలని పేర్కొన్నారు. ధరఖాస్తుతో పాటు తల్లిదండ్రుల ఆదాయ ధృవపత్రము, భోనాఫైడ్ ధృవపత్రము, ఆన్‌లైన్ కలిగి ఉన్న ఏదేని జాతీయ బ్యాంకులో తల్లిదండ్రులు, విద్యార్థి సంయుక్త కలిగి ఉన్న బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ప్రతి, గత సంవత్సరం ప్రోగ్రేస్ రిపోర్టు ప్రతి, నివాస నిర్థారణకై రేషన్ కార్డు/ ఓటర్ ఐడి కార్డు/ విద్యుత్తు బిల్లు/ గ్యాస్ బిల్లులలో ఏదేని ఒకటి, ప్రధానోపాధ్యాయులు ధృవీకరించిన ఫోటొలు, మైనారిటీ కమ్యూనిటీ డిక్లరేషన్ ప్రతిని జతపర్చాలని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 1800-425-1068, 040-23392243, సెల్ నంబర్ 80083 33268, 80083 33269 లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
|
|
|