|
|
ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం ద్వారా రుణాలు
రంగారెడ్డి, జులై 16 (ఫీచర్స్ ఇండియా): రంగారెడ్డి జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం ద్వారా ( పిఎమ్‌ఇజిపి) ద్వారా రుణ మంజూరీ ఎంపిక కోసం జూలై 15, 16 తేదీల్లో నిర్వహించిన ఇంటర్వూకు మొత్తం 907 మంది హాజరయినట్లు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో ఖాధీ మరియు గ్రామీణ పరిశ్రమ కమీషన్‌కు సంబంధించిన 295, ఖాదీబోర్డుకు సంబంధించి 200, జిల్లా పరిశ్రమల కేంద్రానికి సంబంధించి 412 మంది ఉన్నారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధికల్పనా పధకానికి ( పిఎమ్‌ఇజిపి) కింద నిర్ణీత వ్యవధిలో ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జులై 15, 16 తేదిల్లో జిల్లా ఖాధీ గ్రామీణ పరిశ్రమలకు సంబంధించిన టాస్క్‌పోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వూలు నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. జులై 15న నిర్వహించిన ఇంటర్వూలు ప్రశాంతంగా జరిగాయని, జులై 16న ధరఖాస్తు చేసుకోని అభ్యర్థులు కూడా రావడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ఆ రకంగా వచ్చిన అభ్యర్థులకు ఎంపికకు సంబంధించిన నియమ నిబంధనలను వివరించి ముందుగా ధరఖాస్తు చేసుకున్నవారే ఇంటర్వూలకు అర్హులన్న విషయాన్ని తెలియపర్చామని జె.సి. పేర్కొన్నారు.
|
|
|