న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
నవ వన మహోత్సవంలో భారీగా మొక్కలు

కర్నూలు, జులై 16 (ఫీచర్స్ ఇండియా): సమాజంలో ప్రతి పౌరుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని కర్నూలు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎ. వెంకటస్వామి అన్నారు. శుక్రవారం రాయలసీమ యూనివర్శిటీ ఆవరణంలో నవ వన మహోత్సవంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ, రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ జె.వి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్‌ ఎన్‌.డి.కె. నాయక్‌, ఫారెస్ట్‌ కన్జర్యేటర్‌ రత్నాకర్‌ జొహరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెడ్‌.పి ఛైర్మన్‌ మాట్లాడుతూ చెట్లు జీవించినంత కాలం కాలుష్యాన్ని నియంత్రించి సమాజంలో అనేక రకాలుగా ఉపయోగ పడతాయని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. చెట్టు కొట్టిన తర్వాత కూడ కలప రూపంలో గృహ నిర్మాణానికి ఉపయోగ పడుతుందన్నారు. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలల ఆవరణంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత విద్యార్థుల ప్రధాన భూమికగా తీసుకోవాలన్నారు. ఫలాలు, కూరగాయల మొక్కలు నాటి విద్యార్థుల్లో వ్యవసాయంపై అవగాహన తీసుకరావాలని సూచించారు. బయోడిజిల్‌ను ఉత్పత్తి చేసే కానుగ చెట్లను పెంచాలన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు 102 కోట్ల రూపాయలతో లింకు రోడ్లు నిర్మిస్తున్నామని రోడ్ల కిరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి వాతావరణాన్ని పరిరక్షించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ దేశవాళీ మొక్కలైన మర్రి, రావి, కరక్కాయ, కానిగకాయ, ఉసిరికాయ, తెల్లమద్ది తదితర ప్రాధాన్యతగల ఔషద మొక్కలు పెంచాలని అటవీ అధికారులకు సూచించారు. వర్షాకాలం మొదలైందని ప్రభుత్వ సంస్థలు, పాఠశాల భవనాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో నిరంతరాయంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఔషద మొక్కలు నాటి వాటి ప్రాధాన్యతను ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ఎవరూ చెట్లు కొట్టరని కలెక్టర్‌ సూచించారు. నవ వన మహోద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 66 వేల మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల కిరువైపుల ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు స్పేషల్‌ డ్రైవ్‌ చేపడతామని కలెక్టర్‌ వివరించారు. కోడుమూరు శాసనసభ్యులు మురళీ కృష్ణ మాట్లాడుతూ నెలలో ఒకరోజు మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటే 60 శాతం మొక్కలు బ్రతికి ఉపయోగ పడతాయన్నారు. మొక్కలు పెంచితే తప్ప గృహనిర్మణానికి అనుమతి నివ్వమనే నిబంధనను మున్సిపల్‌ అధికారులు సూచించాలని కోరారు. ప్రహరీ గోడలేని స్థలాల్లో బΒΈ%ా ఫెన్సింగ్‌ వేసుకొని విపరీతంగా మొక్కలు పెంచాలన్నారు. రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ జె.వి.ప్రభాకరరావు మాట్లాడుతూ ఒక చెట్టును 30 సంవత్సరాలు కాపాడితే కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఆక్సిజన్‌, వుడ్‌ మానవ సమాజానికి ఇస్తుందన్నారు. మొక్కల పెంపకంపై విద్యార్థుల్లో సంపూర్ణ అవగాహన కల్పిస్తే భవిష్యత్‌ తరంలో అటవీ సంపద పెయగుతుందన్నారు. ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ రత్నాకర్‌ జోహరి మాట్లాడుతూ సమాజంలో చెట్లు ఒక భాగమని చెట్లను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. మొక్కల పెంపకాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా భావించి అటవీ అభివృద్ధి చేయాలని సూచించారు. సామాజిక అడవుల జిల్లా అటవీ శాఖాధికారి టి. నరసింహులు మాట్లాడుతూ జాతీయ అటవీ విధానం ప్రకారం భౌగోళిక విస్తర్ణలో 33 శాతం అడవులకు గాను 22 శాతమే అడవులున్నాయని పెద్ద ఎత్తున మొక్కలు నాటి అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందన్నారు. అడవులను రక్షించకపోతే సముద్ర నీటిమట్టం పెరిగి కొన్ని దేశాలు మునిగి పోయో ప్రమాదం వుందని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం వుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ నాగరాజారావు, డి.ఎఫ్‌.ఓ రామకృష్ణ, డిపిఆర్‌ఓ పి.తిమ్మప్ప, ఆర్‌.డి.ఓ బాలయ్య, పసుపుల గ్రామ సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, ఎమ్‌.పి.టి.సి సుబ్బన్న, తహశీల్దారు తిప్పేనాయక్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అంత క్రితం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, కలెక్టరు? %్‌కోడుమూరు , పాణ్యం ఎంఎల్‌ఎలు, జిల్లా అదికారులు మొక్కలు నాటి నీరు పోసి నవ వనంలో పాల్గొని మొక్కలు నాటారు. కర్నూలు మాంటిస్సొరి, దిన్నెదేవరపాడు జెడ్పి పాఠశాల విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బంది మొక్కలు నాటారు.