న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
పచ్చదనం ద్వారానే పర్యావరణ పరిరక్షణ

వనమహోత్సవంలో జిల్లా కలెక్టర్ పురుషోత్తంరెడ్డి హితవు
మహబూబ్‌నగర్‌, జులై 16 (ఫీచర్స్ ఇండియా): పర్యావరణ సమతుల్యాన్ని సాధించడానికి అందుబాటులో ఉన్న స్థలంలోనే మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ యం. పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. 61వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జడ్చర్లలోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో చెట్లను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలోఒకే రోజు 67 వేల మొక్కలను నాటేందుకు సంకల్పించినందున ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తమ వంతుగా ప్రతిఒక్కరు మొక్కలు నాటాలన్నారు. జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థుల ద్వారా 2,500 మొక్కలను నాటుతున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. గత 56సంవత్సరాల క్రితంజిల్లాలో అడవి, విస్తృతంగాచెట్లు ఉండేవని, అభివృద్దిలో భాగంగా చెట్లను నరుకుతూ వస్తున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో జిల్లా ఎడారిగా మారిపోతుందన్నారు. అందుకే కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ఇంటి ఆవరణల్లో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ చెట్లు నాటాలని కోరారు. చెట్లు నాటి విడిచిపెట్టకుండా అవి ఎదగడానికి నీళ్లు పోస్తు వాటి ఎదుగుదలను పరిశీలిస్తుండాలన్నారు. ఈ కార్యకంమంలో పాల్గొన్న జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జి. సుధీర్‌ బాబు మాట్లాడుతూ పర్యావరణం సమతుల్యంగా ఉండటానికి 34శాతం అడవి ఉండాలని, అందులోచెట్లు విరివిగా ఉన్నప్పుడే సరిపడ వర్షాలు పడతాయన్నారు. చెట్లు నాటితే అవి మనకు ఫలాలను అందజేస్తాయన్నారు. ప్రతి విద్యార్థి, ఉద్యోగిచెట్లు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిందిగా కోరారు. జడ్చర్ల శాసన సభ్యులు యం.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ చెట్లు తరిగిపోవడం మూలంగా వాతావరణం కాలుష్యం పెరిగిపోయిందన్నారు. ప్రస్తుతం నీళ్లు కొనుక్కొని తాగుతున్నాము, రాబోయే రోజుల్లో గాలిని కూడా కొన్నుకోవలసిన పరిస్థితి ఎర్పడకుండా ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటేధృక్పథం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఫారెస్టు అధికారినాగభూషణం అధ్యక్షత వహించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్రపై నిర్వహించివ్యాసరచన పోటీలో మొదటి స్థానం పొందిన జయప్రకాశ్‌ నారాయణ కళాశాల బి.టెక్‌ విద్యార్థి కె.శ్రీకాంత్‌, రెండవ స్థానం పొందిన నాగార్జున డిఎడ్‌ కాలేజ్‌ విద్యార్థి యం.మహెశ్‌ కుమార్‌ను, అదే విధంగా నేటి పర్యావరణం-మన బాధ్యత అన్న అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో మొదటి స్థానం సాధించిన ఎస్విఎస్‌ వైద్య కళాశాల 10వ బ్యాచ్‌ విద్యార్థిని మల్లిక, రెండవ స్థానం పొందిన అదే కళాశాలకు చెందిన విద్యార్థిని సిహెచ్‌.స్వాతికి ముఖ్య అతిథులు బహుమతులందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల జడ్పిటిసి బాగ్యలక్ష్మీ, యంపిపి నిత్యానందం, అదనపు ఎస్‌పి మాధవాచారి, ఆర్డిఓ రాజేశం, డిప్యూటీ ఎస్‌పి గీతాదేవి, డిఎస్పీ జాన్‌ మనోహర్‌, జడ్చర్ల తహశిల్దారు సలాం, ఎంపిడిఓ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.