|
|
ఖమ్మం మార్కెట్ యార్డు ఆకస్మిక తనిఖీ
ఖమ్మం, జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును కలెక్టర్ డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యార్డును పరిశీలిస్తున్న సమయంలొ వ్యాపారులు కలెక్టర్ వద్దకు వచ్చి మిర్చి మార్కెట్కు ఎక్కడికి తరలించవద్దని, తరలిస్తే కార్మికులకు ఎక్కువ నష్టపోతారని విన్నవించుకున్నారు. మిర్చిపంట మార్కెట్ రావడంతో ఘాటు ఎక్కువగా వస్తున్నదని ప్రజల పిర్యాదులు చేశారని అంతేకాకుండ ట్రాపిక్ సమస్యలు కూడ ఎక్కువగా ఉందని విజ్ఞపనలు వచ్చాయని కలెక్టర్ వారికి వివరించారు. ఘాటు లేకుండ చేసెందుకు ముందస్తు చర్యలు గైకొనాలని ఇతర జిల్లా మార్కెట్ యార్డులు ఎడ్ల బండ్లు సిబ్బందికి క్వాటరు మార్కేట్ కార్యాలయాన్ని తొలగిస్తే ఆరు ఎకరాల వరకు స్థలం ఏర్పడుతుందని అప్పుడు లక్ష బస్తాల వరకు కెపాసిటి దాటుతుందని వ్యాపారస్తులు వివరించారు. మార్కెట్ కార్యదర్శి మాట్లాడుతూ మిర్చి మార్కెట్ వలన ఘాటు ఎక్కువగా వస్తున్నదని విషయంలో గతంలో ఖమ్మం అర్బన్ మండలంలోని రఘనాదపాలెంలో 20 ఎకరాల స్థలం కేటాయించారని, అయితే అంతకు ముందు ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ సలాన్ని కేటాయించడంతో వారు హైకోర్టును అశ్రయించారని కలెక్టర్‌కు వివరించారు. ఒక మిర్చి మార్కెట్ను తరలిస్తే అడ్తిదారులు రావంటున్నారని మొత్తం 4 యార్డులు తరలిస్తేనే అక్కడికి తాము కూడా వెళ్లడానికి సిద్ధమని యార్డు కార్యదర్శి కలెక్టరుకు వివరించారు. మార్కెట్ చుట్టు కోల్డ్ స్టొరేజ్ గొదాములు ఉన్నందున రైతుకు గిట్టుబాటు ధర రానప్పుడు వీటిని వినియోగించుకునేందుకు ఉపయోగపడుతాయని తిరిగి అమ్ముకునేందుకు కూడ ఎంతో సులభతరం అవుతున్నందున వృదాగా ఉన్న స్థలం కాలం చెల్లిన భవనాలను తొలగించి మిర్చి యార్డును విస్తారంగా అబివృద్ది చేసి ఎక్కడికి తరలిపోకుండ చూడాలని వ్యాపరస్థులు కలెక్టరును కోరారు.
|
|
|