న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
విశాఖ ఉక్కులో భారీగా వనమహోత్సవం

విశాఖపట్నం, జులై 16 (ఫీచర్స్ ఇండియా): విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో శుక్రవారం వన మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఉక్కునగరంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పులుసు జనార్ధనరావు, స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్) వై.మనోహర్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఉమేష్ చంద్ర, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.పి.చౌదరి, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్.ఐ.ఎన్.ఎల్.) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కె.విద్యాసాగర్, అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్.ప్రతాప్ కుమార్, కన్జర్వేటర్ డాక్టర్ బి.త్రినాధరావు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. పచ్చదనం అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు స్టీల్ ప్లాంట్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అతిధులు కొనియాడారు. మొక్కలు పచ్చదనాన్ని కాపాడడానికే కాకుండా కాలుష్యాన్ని నివారించడానికి కూడా ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించి, విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే వెంకట్రామయ్య కోరారు.