న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
సోంపేట సంఘటనలో ముద్దాయి ప్రభుత్వమే

కర్నూలు, జులై 16 (ఫీచర్స్ ఇండియా): శ్రీకాకుళం జిల్లా సోంపెంట కాల్పుల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ. గఫూర్‌, జిల్లా కార్యదర్శి టి.షడ్రక్‌ అన్నారు. కర్నూలు సుందరయ్య భవన్‌లో టి.రమేశ్‌కుమార్‌ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోంపేట ఘటనను తీవ్రంగా ఖండించారు. సదరు సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.పది లక్షలు, గాయపడిన వారికి రూ.అయిదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.సంఘటనపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని హితవు పలికారు. లేదంటే ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి, బి.రామాంజనేయులు, వివిధ డివిజన్ల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.