|
|
17న కర్నూలులో జిల్లా నీటి సలహా మండలి భేటీ
కర్నూలు, జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం ఈనెల 17న జరగనుంది. ఆరోజు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో జరిగే ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆధ్యక్షతవహిస్తారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, జిల్లాలోని శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్ ఒక ప్రకటనలో సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి కాలువలకు నీటి విడుదల తేదీలను ఖరారు చేయడం, ఇతర సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే నెల 2, 3 తేదీలలో జరిపే శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది మహోత్సవ ఏర్పాట్లపై జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
|
|
|