న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఎలా పిలిచారన్నది కాదు... ఆకట్టుకోవాలి!

ముంబయి, జులై 16 (ఫీచర్స్ ఇండియా): నటీనటులకు పేర్ల ముందు విశేషణాలను పెట్టి పిలవడం చిత్ర సీమలో మామూలే! అయితే వాటిని కొందరు ఒప్పుకుంటారు. ఇంకొందరు ఆ రకం 'టాగ్'లు మాకొద్దు అని అభ్యంతరమూ చెపుతారు. కానీ అలాంటి అభ్యంతరాలకు దూరంగా, ప్రేక్షకులు ప్రేమతో తన పేరు ముందు చేర్చిన 'సెక్సీ' టాగ్ను ఆనందంతో ఆహ్వానించిన తార 'బిపాషాబసు'. వందేళ్ళొచ్చినా సరే... ''నాకేం అబ్జక్షన్ లేదు, నా పేరు ముందు 'సెక్సీ' టాగ్. నిజానికి నాకు వందేళ్ళొచ్చినా అప్పుడు కూడా సెక్సీ బొమ్మగా వుంటా. అయినా 'సెక్స్' అంటే కేవలం ఒంటి ప్రదర్శనే అని భావించవద్దు. నా దృష్టిలో 'సెక్స్' మొత్తం పెర్సనాల్టీకి సంబంధించినది. చూపులు, బుద్ధి, బలం, దాన్ని ప్రదర్శించే తీరులో మనం అనుకున్న ఈ విశేషణం సారం వర్తిస్తుంది. మంచేదో తేలియాలంటే తప్పులూ చేయాలి... నిజమే... నేను ఆ మధ్య పరిమితికన్నా మించిన బరువు పెరిగి, అదికాస్తా అభ్యంతరకరంగా తెరపై తయారైంది. అసలిదెందుకొచ్చిందంటే ఒకే సంవత్సరంలో పది నుంచి పన్నెండు చిత్రాలు చేయవలసి వచ్చింది. దాంతో నటిగా పెర్సనాల్టీకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో అధిక బరువు సమస్య లేవనెత్తింది. ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నా. అయినా అసలు మంచేదో తెలిసి దాన్ని నేర్చుకోవాలంటే ఇలాంటి తప్పులే ఉపకరిస్తాయనిపిస్తుంది. ఒకరికొకరు ప్రత్యామ్నాయం కాదు... నా అదృష్టం కొద్దీ పరిశ్రమకొచ్చిన తక్కువ కాలంలోనే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు నా పరమయ్యాయి. 'రాజ్', 'జిస్మ్', 'కార్పొరేట్' చిత్రాలు ఈ కోవకు చెందుతాయి. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మనం ఇండస్ట్రీకొచ్చిన తర్వాత చేసే పాత్రల ద్వారా ఓ వర్గం ప్రేక్షకులు తప్పకుండా మనల్ని అభిమానిస్తారు. దాంతో పరిశ్రమ మన అవసరాన్ని గుర్తిస్తుంది. తద్వారా అవకాశాలూ వస్తాయి. ఇకప్పుడు ఒకరికొకరు ప్రత్యామ్నాయం అన్న ప్రసక్తే రాదు. అదే విలువైన బహుమానం... పితృదినోత్సవం గురించి... తండ్రీ - కూతుళ్ల మధ్య ప్రేమ కొలువడానికి అది ఫాదర్స్ డే కానక్కరలేదు. ప్రతి పుత్రికా తండ్రికి ఎప్పటికీ కృతజ్ఞురాలే నా వరకూ వస్తే నాకు అంతా మా డాడీయే! జీవితంలో నాకు ఆయనిచ్చిన బేషరతు సహకారం మరువలేనిది. నాక్కావల్సిన రీతిలో స్వాతంత్ర్యాన్నిచ్చి నన్ను ప్రతి స్థితిలోనూ విశ్వసించారు. ఆ నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చేయలేదు. నా పట్ల నాన్నకున్న నమ్మకమే నాకాయనిచ్చిన స్పెషల్ గిఫ్ట్. అదెప్పటికీ నేను మరచిపోలేను'' అంటూ ఆర్ద్రత నిండిన కళ్లతో చెప్పుకొచ్చింది.