న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ఎస్‌బీఐలో‌ విలీనం

న్యూఢిల్లీ, జులై 16 (ఫీచర్స్ ఇండియా): బ్యాంకింగ్ రంగాన విలీనాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రయివేటు రంగ బ్యాంకులే విలీనబాటలో ముందుండగా ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులూ అదే దారిన పయనిస్తున్నాయి. తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ విలీనం వల్ల స్టేట్‌ బ్యాంకుకు నిర్వహణా ఖర్చులు తగ్గుతయి, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండోర్‌ సిబ్బంది మాతృసంస్థ స్టేట్‌ బ్యాంకులో విలీనం అవుతారని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అంబికాసోని కేబినెట్‌ సమావేశం తర్వాత విలేకరులకు తెలిపారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌కు మధ్యప్రదేశ్‌ అవతల చత్తీస్‌గఢ్‌లో చాలా శాఖలున్నాయని వాటినన్నింటిని స్థానికంగా ఉండే స్టేట్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తాయని దీంతో నిర్వహణా ఖర్చులు తగ్గుతాయని ఆమె వివరించారు. విలీనం తర్వాత ఇరు బ్యాంకుల మధ్య పోటీ తగ్గుతుందన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విపరీతమైన పోటీ ఎదుర్కుంటోంది. ఇద్దరిది ఒకే బ్రాండ్‌ ఉండటం కూడా ఒక కారణమని అన్నారు. విలీనం వల్ల స్టేట్‌ బ్యాంకు భారీ ఎత్తున వ్యాపాక కార్యకలాపాలను విస్తరించుకోవచ్చునని ఆమె అన్నారు. ఎస్‌బీఐకి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌లో 98 శాతం వాటా కలిగి ఉంది. ఈ విలీనానికి ఎస్‌బీఐ సెంట్రల్‌ బోర్డు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. దీనికి కేంద్రం కూడా ఆమోదముద్ర వేసింది. 2008 ఆగస్టులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర ఎస్‌బీఐలో విలీనం అయింది. ఈ విలీనం ప్రకారం స్వాప్‌ రేషియా 34ః100 దమాషాగా నిర్ణయించాయి. 100 షేర్లున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర వాటాదారులకు 34 ఎస్‌బీఐ వాటాలు కేటాయిస్తారు. దీని కోసం ఎస్‌బీఐ కొత్తగా 1.16 లక్షల షేర్లు రూ.10 ముఖ విలువగలవి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ షేర్‌ హోల్డర్లకు కేటాయిస్తారు.
భారతీయ స్టేట్ బ్యాంకు గురించి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో ప్రారంభమైన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ, ప్రవాస భారతీయ సేవలను కూడా అందిస్తోంది. 1955లో భారత ప్రభుత్వం ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనంలోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
ప్రారంభ బీజాలు...
19వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806 జూన్ 2న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్, రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు (బ్యాంక్ ఆఫ్ బాంబే (1840లో స్థాపన), బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921లో స్థాపన)) కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బాంకు స్థాపించేవరకు ఈ బ్యాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడ నిర్వహించింది. భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం 1955 ఏప్రిల్ 30 నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటుచేసిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
కాలగమనంలో స్టేట్ బాంకు...
* 21 జూన్, 1806: కలకత్తా బ్యాంకు స్థాపన. * 21 జనవరి, 1809: దీనిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా. * 15 ఏప్రిల్, 1840: బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన. * 11 జూలై, 1843: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన. * 1861: పేపర్ కరెన్సీ చట్టం జారి. * 27 జనవరి, 1921: మూడు బాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు. * 11 జూలై, 1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు). * 1959: స్టేత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ , దీనితో 8 పూర్వపు రాష్త్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది. * 1980 లు కేరళ లో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ లో కల్పివేశారు. * 29 జూన్, 2007: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది.
అనుబంధ బ్యాంకులు
భారతీయ స్టేట్ బ్యాంకుకు అనుబంధంగా ఏడు బ్యాంకులు ఆవిర్భవించాయి. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి 1959లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఈ బ్యాంకలన్నింటినీ కలిపి స్టేట్ బ్యాంక్గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కలిపి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్
విదేశాలలో శాఖలు
* ఆస్ట్రేలియా
* బహరీన్
* బంగ్లాదేశ్
* బెల్జియం
* కెనడా
* దుబాయ్
* ఫ్రాన్స్
* జర్మనీ
* హాంగ్‌కాంగ్
* ఇజ్రాయెల్
* జపాన్
* చైనా
* మాల్దీవులు
* సింగపుర్
* దక్షిణాఫ్రికా
* శ్రీలంక
* ఓమన్
* బహమాస్
* ఇంగ్లాండు
* అమెరికా