|
|
భారతీయ రూపాయికి సరికొత్త చిహ్నాం
న్యూఢిల్లీ, జులై 15 (ఫీచర్స్ ఇండియా): ఎప్పుడూ జేబులో గలగల మంటూ అల్లరి చేసే చిల్లరలో రూపాయిదే అగ్రస్థానం. ఆ రూపాయికి ఇప్పుడు అంతర్జాతీయంగా ఓ సరికొత్త రూపు రానుంది. రూపాయికి ఓ నిర్దిష్టమైన కొత్త చిహ్నాన్ని ఎంపికచేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. దేవనాగరి భాషలోని 'రా' అక్షరం, ఇంగ్లీష్‌లోని 'ఆర్' సమ్మిళితంగా ఈ గుర్తు ఉండనుంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో పోస్టు గ్రాడ్యూయెట్ అయిన డీ ఉదయకుమార్ రూపొందించిన రూపాయి గుర్తుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గుర్తు కోసం వచ్చిన దరఖాస్తులలో ఐదింటితో కేంద్రప్రభుత్వం తుది జాబితా తయారు చేసింది. ఇందులోని ఉదయ్‌కుమార్ రూపొందించిన గుర్తుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది కేవలం రూపాయి చిహ్నాం మాత్రమేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి అంబికా సోని తెలిపారు.
|
|
|