|
|
చార్మినార్‌లో కానిస్టేబుల్‌కు కత్తిపోట్లు
హైదరాబాద్, జులై 15 (ఫీచర్స్ ఇండియా): తన సోదరితో సన్నిహితంగా మెదులుతున్న కానిస్టేబుల్‌ను ఓ వ్యక్తి కత్తితో పొడిచిన సంఘటన పురానాపాల్‌లోని పార్థీవాడలో జరిగింది. కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమైన కానిస్టేబుల్‌ను ఉస్మానియాకు తరలించారు. కేసుకు సంబంధించి హుస్సేనిఆలం పోలీసులు కథనం ప్రకారం.. లాలాపేట్ పోలీసు కానిస్టేబుల్ తేజనాయక్(45) గత కొంత కాలంగా పురానాపూల్ పార్ధివాడలోని రామ్‌దాస్(50) సోదరి సునీతతో సన్నిహితంగా ఉంటున్నాడు. సునీత కుటుంబానికి మిత్రుడిగా మారాడు. ఇది నచ్చని రామ్‌దాస్ పలుమార్లు కానిస్టేబుల్‌ను వారించాడు. రామ్‌దాస్ సోదరుడు సురేష్ ఇటీవల మృతి చెందడంతో అతని దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బుధవారం రాత్రి సునీత తన సోదరుడు రామ్‌దాస్ నివాసానికి వచ్చింది. సునిత రామ్‌దాస్ నివాసంలో ఉన్న విషయం తెలుసుకొని ఆమె వద్దకు కానిస్టేబుల్ తేజనాయక్ వచ్చాడు. తేజానాయక్ సునీతను చేయి పట్టుకొని లాగడం గమనించిన రామ్‌దాస్ ఆగ్రహంతో కత్తితో అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో తేజనాయక్ మెడకు రెండుచోట్ల కత్తిపోట్లు దిగాయి. తీవ్రంగా అతన్ని వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు హుస్సేనిఆలం ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
|