|
|
కూరగాయల సాగుకు రంగారెడ్డి అనుకూలం
రంగారెడ్డి, జులై 14 (ఫీచర్స్ ఇండియా): రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగు, పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేద విద్యార్థులకు కార్పోరేటు విద్య తనకు అత్యంత ప్రాదాన్యతగల అంశాలని ఇందుకనుగుణంగా తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎమ్.దానకిషోర్ ఆదేశించారు. తూర్పు డివిజన్ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన డివిజినల్ స్థాయి సమీక్షలో కలెక్టరు తన ప్రాదాన్యతలను వెల్లడించారు. జిల్లాలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును, పాడి పరిశ్రమను అభివృద్ది చేసేందుకు ఇప్పటికే ప్రణాళికను రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించుట మరింత ప్రాదాన్యతగల అంశమని అన్నారు. తమ మండలాల పరిధిలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అందులో ఎన్నింటిలో ఆక్రమాలు ఉన్నాయో గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి పారదర్శకత పాటించాలన్న లక్ష్యంతో జిల్లా వెబ్‌సైట్ ను రూపొందించడం జరిగిందని ఈ వెబ్‌సైట్ ను గురువారం లాంఛనంగా ప్రారంభిస్తామని కలెక్టరు పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్ లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డెట్ చేయాల్సిందిగా తహసీల్దార్లను ఆదేశించారు.
|
|
|