న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
డిఎస్‌కు ఎన్నికల సంఘం మరో నోటీస్‌

హైదరాబాద్‌, జులై 14 (ఫీచర్స్ ఇండియా): ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ఎన్నికల సంఘం (ఇసి) మరో నోటీస్‌ జారీ చేసింది. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని జూన్‌ 24న డిఎస్‌ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారాంగా ఇసి ఆయనకు నోటీస్‌ జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల లోపల వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం డిఎస్‌ని ఆదేశించింది.