న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
వర్ధమానులకు దారిచూపిన దేవుడు వైఎస్

రాజమండ్రి, జులై 14 (ఫీచర్స్ ఇండియా): జగన్‌ ఓదార్పు యాత్రకు పోటెత్తుతున్న జనాన్ని చూసి చాలా మంది పెద్దలు ఓర్వలేకపోతున్నారని ఏఐసీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకి వ్యాఖ్యానించారు. ఆమె కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌లో వైఎస్‌ విగ్రహం ఏర్పాటు కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాత్రకు అవరోధాలు కల్పించాలని కొందరు చేస్తున్న కుటిల యత్నాలు జనాదరణ ఉన్న జగన్‌ను ఏం చేయలేవన్నారు. రోజురోజుకీ ప్రజల్లో జగన్‌ ప్రాబల్యం పెరుగుతూనే ఉంటుందన్నారు. ఆమె వెంట కడియం ఉపసర్పంచ్‌ తోరాటి శ్రీను, జెడ్పీటీసీ సభ్యుడు దొంతంశెట్టి చిన వీరభద్రయ్య, కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ సర్కార్‌ భాషా, కాంగ్రెస్‌ నాయకులు పండూరి అప్పారావు, సమ్మెశెట్టి ప్రసాద్‌, కుమార్‌ తదితరులున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈనెల 15న ధవళేశ్వరం వస్తున్న జగన్‌కు ఘన స్వాగతం పలకాలని ఏఐసీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆమె ధవళేశ్వరంలో జగన్‌కు స్వాగత సన్నాహాలను, వై ఎస్‌ విగ్రహం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్‌ ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతుందని పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ట కమిటీ కన్వీనర్‌ పి.అప్పారావు, డాక్టర్‌ టి. ప్రభాకరరావు, జి. శ్రీను, తలారి వరప్రసాద్‌, పి. జయప్రసాద్‌, వార్డు సభ్యుడు దేవా పాల్గొన్నారు.