|
|
సహ చట్టాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు
హైదరాబాద్, జులై 14 (ఫీచర్స్ ఇండియా): సమాచార హక్కు చట్టం-2005ను సెక్షన్ అధికారులు ఆషామాషిగా తీసుకోకుండా పకడ్బంధీగా ఆమలు చేయాలని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అదికారి మధన్ మోహన్‌రావు అన్నారు. బుధవారం ఆయన సమాచార హక్కు చట్టం ఆమలు పై కలెక్టరేటు, రెవెన్యూ శాఖ సిబ్బందికి పునచ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ చట్టం కింద సమాచార కోరే వారికి నిబంధనల ప్రకారం కార్యాలయంలో ఆందుబాటులో ఉన్న సమాచారం అందించినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. లేకపోతే జరిమానా విధించడం, జైలుకు పంపడం వంటి శిక్షలు పడ వచ్చని తెలిపారు. రెవెన్యూ శాఖలో ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఏ విషయంపై సమాచారం కోరుతారో ఆయా వివరాలు, చట్టంలో వర్తించే సెక్షన్‌ను ఉదహరణతో వివరించారు. సెక్షన్ అధికారులు నిర్లక్షంగా వ్యవరించకుండా సమాచార ఇచ్చినట్లైతే ఎటువంటి సమస్యలు ఉండవని, లేకపోతే గోరుతో పోయెదే గోడ్డలి పెట్టు వరకు వస్తుందని హెచ్చరించారు . సమాచార హక్కు చట్టం చాప్టర్ -2 వివరాలను మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉంచాలని, ఈ సమాచారం ఎప్పటిక్పుడు ప్రతి సంవత్సరం నవీకరణ చేయాలని తెలిపారు. ఈ చట్టంపై ఏవైన సమస్యలు ఉంటే నివృత్తి చేసుకొనవచ్చని సూచించారు.
|
|
|