న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
కడపలో రాయల పట్టాబిషేక మహోత్సవాలు

కడప, జులై 14 (ఫీచర్స్ ఇండియా): శ్రీకృష్ణదేవరాయల పట్టాబిషేక పంచ శతాబ్ద మహోత్సవాలు జిల్లాలో ఈ నెల 25, 26 వ తేదిలలో నిర్వ హిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశిభూషన్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్సవాలు ఈ నెల 28, 29 తేదిలలో నిర్వ హిందదలిచామని, విద్యార్థుల సౌకర్యం నిమిత్తం వారు కూడ పాల్గొనాలనే ఉద్దేశ్యంతో ప్రజల విజ్ఞప్తి మేరకు 25 వ తేది ఆదివారము సెలవు రోజున ఉత్సవాలు ప్రారంబించదలచి 25, 26 తేదీలలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశామని జిల్లా కలెక్టరు వివరించారు. ఈ మేరకు ఉత్సవాలు 25, 26 తేదీలలో నిర్వహించేందుకు అంగీకారం తెల్పుతూ రాష్ట్ర యూత్‌ అడ్వాన్స్‌ మెంట్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సీపల్‌ కార్యదర్శి డాక్టర్ చెల్లప్ప ఉత్తరువులు జారీ చేశారని జిల్లా కలెక్టరు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించ వలసినదిగా జిల్లా కలెక్టరు కోరారు.