న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్యూ కాంప్లెక్స్‌లన్ని నిండిపోయాయి. సర్వ దర్శనానికి 15 గంటలు , శ్రీఘ్రదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో టీటీడి అధికారులు మహాలఘుదర్శనాన్ని కొనసాగిస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి ఉండలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల కోసం పడిగాపులు కాస్తున్నారు. మరో రెండు రోజులు రద్దీ ఇదేవిధంగా కొనసాగే అవకాశముంది.