న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
నిరుపయోగంగా మారుతున్న నీటి ట్యాంకులు!

(ఫీచర్స్ ఇండియా, వరంగల్)
నిర్వహణ లోపం, సంబంధిత అధికారుల అలసత్వం ఫలితంగా వరంగల్ జిల్లాలోని చాలా గ్రామాలలో నీటి సరఫరా ట్యాంకర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సిన ట్యాంకర్ల నిర్వహణ జిల్లా వ్యాప్తంగా అధ్వాన్నంగా మారిందన్న విమర్శలను సైతం జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ ఆర్టీసి బస్టాండ్‌ సమీ పంలోని రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ట్యాంక్‌ పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉండి బిచ్చలుబిచ్చలుగా పెళ్ళలు ఊడిపడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎప్పుడు కూలు తుందో తెలియని దుస్థితిలో ఆ రెండు ట్యాంక్‌లు ఉన్నాయి. ప్రమాదవ శాత్తు ట్యాంక్‌ కూలితే ఆ ప్రాంతంలో భారీ ప్రాణనష్టం జరుగుతుంది. అయినప్పటికి పంచాయతీ పాలకవర్గం పట్టించుకోకపోవడం పట్ల వి మర్శలు వినవస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. దశాబ్ధాల క్రితం ని ర్మించిన ఓవరెడ్‌ ట్యాంక్‌ను ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు.

ఆ ట్యాం క్‌లను ఉపయోగించకపోయినా అందుకు అవసరమైన ఓవరెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణమై ప్రారంభోత్సవానికి నోచుకోకుం డా నిరుప యోగంగా ఉంది. కాగా ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ల ను నేలమట్టం చేయాలని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు గత సర్పంచ్‌ రజనిభారతి హయాంలోనే సూచించారు. ఆ ట్యాంక్‌లు పూర్తిగా నాణ్య త ప్రమాణాలను విస్మరించి నిర్మించారని, దాని వల్ల ఎప్పుడు కూలు తుందో తెలియని పరిస్థితి ఉందని, వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని వేరే ప్రాంతానికి చేర్చి ట్యాంక్‌ను నేలమట్టం చేయాలని సూచించారు.

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా పాలక వర్గం, అధికారులు వ్యవహారిస్తే తెలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తు న్నారు. గతంలో ఈ ట్యాంక్‌ సమీపంలో ఉన్న వారిని పంచాయతీ అధికారులు ఖాళీ చేయాలని సూచించగా వారు కోర్టును ఆశ్రయిం చారు. ఆ కోర్టు తీర్పు కూడా గ్రామ పంచాయతీకి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ట్యాంక్‌ సమీపంలో ఉన్న చిరువ్యాపారులు ప్రాణాలను అరచేతిలో పె ట్టుకొని ఉంటున్నారే తప్ప ట్యాంక్‌ నిర్మాణాలను తొల గింపును ఎందు కు అడ్డుకుంటున్నారంటే తాము ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉపాధి పొందుతున్నామని, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే మళ్లీ ఎక్కడ బత కాలని ప్రశ్నిస్తున్నారు.

ట్యాంక్‌ సమీపంలో ఉన్న పలు కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా పంచాయతీ పాలకవర్గం మరో ప్రదేశాన్ని చూపిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. లేనిపక్షంలో ట్యాంక్‌లను నేలమట్టం చేసినప్పటికి ఆ ప్రాంతంలోనే తాము వ్యాపారాలు చేసుకునేందుకు అ నుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బస్టాండ్‌ సమీపంలోని వాటర్‌ ట్యాంక్‌లు తొలగించేందుకు పాలకవ ర్గం తక్షణమే చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైన నిర్లక్ష్యాన్ని వీడకుంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసి నీటి తో తడిసిపోయి ఎప్పుడో కుప్పకూలుతుందని పలువురు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు నర్సంపేట డివిజన్‌లోని అమీనాబాద్‌లో గోడ కూలి ఇటీవల ఓ వృద్దుడు మృతి చెందాడు. తాజాగా నల్లబెల్లి మండలం మేడపల్లిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం కూలి ప లువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకోనైన పాలక వర్గం వెంటనే ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌లను తొలగించాలని కోరుతున్నారు.