|
|
పుట్టిన ప్రతి బిడ్డపేరును నమోదు చేయించాలి
చిత్తూరు, జులై 11 (ఫీచర్స్ ఇండియా): పుట్టిన ప్రతి బిడ్డపేరును ఖచ్చితంగా రిజిష్టరు చేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. లలితకుమారి పేర్కోన్నారు. ఆధివారం ఉదయం ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద స్దానిక ఎం.ఎల్.ఎ సి.కె.బాబుచే ర్యాలీని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు వి.శేషాద్రి పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి ఎన్.టి.ఆర్. సర్కల్ వరకు, టి.టి.డి. కళ్యాణమండపం వరకు ర్యాలీని నిర్వహించారు.
అనంతరం టి.టి.డి. కళ్యాణమండపంలో జరిగిన సమావేశంలో డి.ఎం.హెచ్.ఒ మాట్లాడుతూ ''జనాభా సేకరణలలో ప్రతి ఒక్కరిని గణనచేస్తారు'' అనే నినాదంతో ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. వివాహ వయస్సును పెంచడం, తాత్కాలిక కుటుంబ నియంత్రణా పద్దతులు పాటించడం ద్వారా శిశు, తల్లి మరణాలను నియంత్రించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పి.హెచ్.సిలకు, సర్జన్లకు రూ. 3000/- ల నగదు పారితోషికం, స్టాప్ నర్సులకు రూ. 2500/- లు, ఎం.పి.హెచ్.ఎ.ఎస్ రూ.2000/- ఆషా వర్కర్లకు ఆషావర్కర్లకు రూ. 1500/-, అంగన్ వాడి వర్కర్లకు రూ. 1000/-, సి.డి.పి.ఓలకు 1500/- వంతున ఇలా ప్రతి విభాగం నుండి ముగ్గరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఒక బిడ్డతో ఆపరేషన్ చేయించు కొన్నవారికి(ఒక జంటకు) రూ. 10000/- లు, ఇద్దరు ఆడపిల్లలు వుండి (ఒకజంటకు) ఆపరేషన్ చేయించుకున్నవారికి, ఇద్దరు పిల్లలు వుండి వేసెక్టమి ఆపరేషన్ చేయించు కున్న (ఒకజంటకు) రూ. 10,000/- వంతున అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ కేశవరెడ్డి, డి.సి.హెచ్.ఎస్ రాజేష్ కుమార్ , 104 జిల్లా కో ఆర్డినేటర్ దుర్గా, 108 జిల్లా కో ఆర్డినేటర్ మూర్తి, గైనకాలజిస్ట్ డాక్టర్ రామలక్ష్మమ్మ, వైద్యసిబ్బంది, నర్శింగ్ విద్యార్దులు పాల్గొన్నారు.
|
|
|